twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హమ్మయ్య..హిట్ వచ్చింది హ్యాపీ: ప్రియమణి

    By Srikanya
    |

    ద్రోణ, మిత్రుడు, ప్రవరాఖ్యుడు...అంటూ ప్రియమణి సినిమాలు వరసగా ఫెయిల్యూర్ అవటం ఆమెను బాగా నిరాశపరిచినట్లుంది.దాంతో తాజాగా సంక్రాంతికి రిలీజై హిట్టు టాక్ తెచ్చుకున్న 'శంభో శివ శంభో' తో ఊపిరి పీల్చుకుంది. ఈ ఆనందాన్ని ఆమె మీడియాతో పంచుకుంది. ప్రియమణి మాట్లాడుతూ... ఇటీవల విడుదలైన 'శంభో శివ శంభో' గురించి చెప్పాలంటే.. నటిగా నాకు ఆత్మసంతృప్తినిచ్చిన చిత్రం ఇది. వాస్తవానికి 'పరుత్తివీరన్‌' తర్వాత హోమ్లీ క్యారెక్టర్స్‌కి అవకాశం వచ్చినా ఒప్పుకోలేదు. ఆ సినిమా హిట్‌ అవ్వడం, నాకు జాతీయ అవార్డు రావడంతో చాలామంది లంగా, ఓణీ టైప్‌ పాత్రలకు అడిగారు. కానీ వరుసగా అలాంటి పాత్రలు చేస్తే రొటీన్‌ అవుతుందనుకున్నాను. అందుకే ఆ పాత్రలకి దూరంగా ఉన్నాను. 'శంభో శివ శంభో'లో పాత్ర నచ్చడంతో అంగీకరించాను.

    'గాళ్‌ నెక్ట్స్‌ డోర్‌' అనే విధంగా నా పాత్ర ఉంటుంది. బేసిక్‌గా నాకు కామెడీ చేయడం ఇష్టం. పూర్తి స్థాయి కామెడీ చిత్రంలో నటించమన్నా ఒప్పుకుంటాను. 'శంభో శివ శంభో' ఒప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణమే. నా పాత్రలో కామెడీ మిక్స్‌ అయ్యుంటుంది. ఈ పాత్రని చాలా ఎంజాయ్‌ చేశాను. ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 'సినీ మాక్స్‌' థియేటర్‌లో చూశాను. మామూలుగా కొన్ని సినిమాలకు ఎక్కడో చోట బోర్‌ అనిపించి కొంతమంది బయటకు వెళుతుంటారు. కానీ ఈ సినిమాని మాత్రం కుర్చీల్లోంచి కదలకుండా చూస్తున్నారు. సహజత్వానికి దగ్గరగా ఉన్న సినిమా కావడంవల్లే ప్రేక్షకుల మెప్పు పొందగలిగింది. ఈ సంక్రాంతికి నా ఖాతాలో ఓ హిట్‌ పడినందుకు ఆనందంగా ఉంది అంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X