కల్లో కూడా ఊహించని ఆఫర్...హ్యాపీ: ప్రియమణి
'అసలు మణిరత్నం దర్శకత్వంలో నటించడమే పెద్ద అదృష్టం. కల్లో కూడా ఆయన సినిమాలో చేస్తానని అనుకోలేదు. కానీ ఆ అపూర్వ అవకాశం ఓ విధంగా త్వరగానే వచ్చింది. ఆయనతో చేసిన తొలి సినిమాకే నటనకు ఆస్కారమున్న పాత్ర దొరకడం నిజంగా నా అదృష్టం. అందరూ అభినందిస్తుంటే..చాలా ఆనందంగా ఉంది' అంటూ తన ఆనందంగా చెప్పుకొస్తోంది ప్రియమణి. మణిరత్నం 'రావణ్' చిత్రం ఫెయిల్యూర్ అయినా ఆ చిత్రంలో లోని ప్రియమణి గెస్ట్ రోల్ అందరి నుండీ ప్రశంసలు అందుకుంటోంది.ఇక త్వరలో ప్రియమణి...మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి సరసన ఓ మలయాళ చిత్రంలో నటించనుంది. ఇక ప్రియమణి..గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన గోలీమార్ చిత్రం ఆ మధ్యన రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అలాగే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆమె నటించిన రక్త చరిత్ర చిత్రం ఆగస్టులో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
గోపీచంద్ గోలీమార్ మణిరత్నం ప్రియమణి రావణ్ శంభో శివ శంభో బెల్లంకొండ సురేష్ gopichand golimaar maniratnam priyamani raavan


Click it and Unblock the Notifications