జూ ఎన్టీఆర్ పెళ్ళికి వెళ్ళొచ్చాకే ప్రియమణికి జ్ఞానోదయం!?
రీసెంట్ గా జరిగిన జూ ఎన్టీఆర్ వివాహానికి ప్రియమణి ఒక్కత్తే హాజరై అందరి దృష్టిలో పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెళ్ళికి వెళ్ళొచ్చాక ఆమెకు జ్ఞానోదయం అయినట్లుంది అంటున్నారు సినీ జనం. ఎందుకంటే..ఆమె రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ...హీరోలకు త్వరగా పెళ్లిళ్లు అయిపోతే మా మీద వచ్చే సగం గాసిప్స్ తగ్గిపోతాయని, దాని ద్వారా హాయిగా మా పని మేం చేసుకోవచ్చునని షాకయ్యే స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ మేరకు ఇటీవల పెళ్ళిళ్లయిన అల్లు అర్జున్, ఎన్టీఆర్‌ల వివాహ వేడుకలకు హాజరైన ఆమె సరికొత్తగా పెళ్లికొడుకుగా ముస్తాబవబోతున్న కార్తీని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ విషయం చెప్పినట్లయిందంటన్నారు.అయితే ప్రియమణితో గాసిప్స్ వచ్చింది కేవలం జగపతిబాబు తోనే. దాంతో జగపతికి ఎప్పుడో పెళ్ళైపోయింది. ఆమె చెప్పే లెక్కలు ప్రకారం అయితే ఆమెపై గాసిప్స్ రాకూడదు కదా అంటున్నారు. అయితే తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే కార్తీ ప్రియమణిలపై అనేక గాసిప్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ గాసిప్స్‌కి వేటు వేయడానికి ప్రియమణి ఇలా కొత్త పాఠాలు వల్లె వేస్తోందంటున్ననారు. ప్రస్తుతం ప్రియమణి తెలుగులో ఎన్టీఆర్ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











