పూరీ జగన్నాధ్ తో నా కల నెరవేరింది: ప్రియమణి
నటిగా నేను ఏ కల అయితే కన్నానో...ఆ కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది. పూరీ జగన్నాథ్ లాంటి టాప్ డైరెక్టర్ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది అంది అంటోంది ప్రియమణి. ఇప్పటి వరకూ వచ్చిన పోలీస్ సినిమాలకు ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎప్పటికైనా స్టార్ హీరోయిన్ గా ఎదగాలని కలలు కన్నా...అది ఈ చిత్రంతో నెరవేరింది అంటోంది. నేను ష్యూర్ గా చెప్తున్నాను...నా రాబోయే చిత్రం 'గోలీమార్' లో నా పాత్ర చూసి ఆశ్చర్యపోతారు. అలాగే ఈ అమ్మాయేనే పరుత్తివీరన్ లో విలేజ్ అమ్మాయిగా చేసింది అని మాట్లాడుకుంటేనే నేను హ్యాపీ ఫీలవుతాను. ఇక గోలీమార్ లో నాది క్యూట్ రోల్..అలాగే ఫెరపార్మెన్స్, గ్లామర్ కలగపిన పాత్ర అని చెప్తూ మురిసిపోతోంది.
ఇక తెలుగులో గోలీమార్, హిందీ, తమిళ భాషల్లో రావణ్, రక్త చరిత్ర చిత్రాలు నా కెరీర్‌కి మైలురాళ్లుగా నిలుస్తాయని నమ్మకంతో ఉన్నాను అంది. ఇక తన కెరీర్ ఈ సంవత్సరం అనుకున్న దానికన్నా బాగానే వెళ్థోందంటూ...జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డు కూడా వరించిందని, అంతులేని ఆనందాన్ని కలిగించే మరో విషయం ఏంటంటే...ఒకే ఏడాది అటు మణిరత్నం, ఇటు రామ్ గోపాల్ వర్మ లాంటి లెజెండ్రీ డైరెక్టర్ల సినిమాల్లో నటించడం. ఈ రెండు సినిమాల ద్వారా బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నాను అంటూ ఆనందంగా చెప్తోంది.


Click it and Unblock the Notifications











