నాకే దక్కడం గమ్మత్తుగా అనిపించింది: ప్రియమణి

By Srikanya

హైదరాబాద్ : 'ఎలోన్‌' అనే చిత్రమే నాకు స్ఫూర్తి. థాయ్‌లో విడుదలైన ఆ చిత్రాన్ని నేను నాలుగేళ్ల క్రితమే చూశాను. చూసిన వెంటనే 'అరె భలే ఉంది ఈ సినిమా. ఇలాంటిది మన దగ్గర చేస్తే చాలా బాగుంటుందే' అని నా మనసులో అనుకొన్నా. కట్‌ చేస్తే... ఆ సినిమా స్ఫూర్తితోనే దక్షిణాదిన 'చారులత' తెరకెక్కడం, అందులో నటించే అవకాశం కూడా నాకే దక్కడం గమ్మత్తుగా అనిపించింది అంటోంది ప్రియమణి. ప్రియమణి అవిభక్త కవలలుగా నటించిన 'చారులత' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది.

అలాగే 'చారులత' కథను దర్శకుడు మన వాతావరణానికి తగ్గట్టుగా మలిచారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం కంటే భిన్నమైన అనుభవం ఎదురైంది. ఒక సవాల్‌గా స్వీకరించి ఈ సినిమాలో నటించా. చారు, లత అనే అవిభక్త యువతుల చుట్టూ ఈ కథ సాగుతుంది. ఒక సంఘటన... వారి జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందనే విషయం కథలో కీలకం. సన్నివేశం ఒకటే... కానీ దాని కోసం రెండుసార్లు... రెండు రకాలైన భావోద్వేగాలు పలికిస్తూ నటించాల్సి వచ్చేది. ద్విపాత్రాభినయం కంటే భిన్నమైన రీతిలో ఉంటుంది. సాంకేతికాంశాలూ ఆ సన్నివేశాల చిత్రీకరణలో కీలక పాత్ర పోషించాయి. వాటిని అవగాహన చేసుకొంటూ నటించాను అందామె.

ఫస్ట్ లుక్ విడుదలకే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పంపిణీ సంస్ధ గీతా డిస్ట్ర్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. గీతా వారు తీసుకోగానే ట్రేడ్ లో ఈ చిత్రంపై మంచి ఆసక్తి కలిగింది. ఇక ఈ చిత్రంలో ప్రియమణి అవిభక్త కవలలుగా కనిపించి అలరించనుంది. ప్రియమణి చేస్తున్న ఈ రెండు పాత్రలులో ఆమె డిపెరెంట్ గా ఉండబోతోంది. ఈ చిత్రంలో రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరించారు. తమిళ చిత్రం 'పరుత్తివీరన్'తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సాధించారు ప్రియమణి. ఆమెకు మరో జాతీయ అవార్డుని తెచ్చిపెట్టే చిత్రం ఇది అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

చిత్రం కథ విషయానికి వస్తే''పుట్టుకతోనే ప్రియమణిది తన సోదరితో విడదీయలేని బంధం. ఎందుకంటే శరీరాలు కలిసి జన్మించిన అవిభక్త కవలలు వారు. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంపై ప్రేమ అనే అంశం ఎలాంటి ప్రభావాన్ని చూపిందన్నదే అసలు కథ. అందులో ఒకరు విలన్ గా మారి మరొకరి జీవితంతో ఆడుకుంటారు. ఎవరు విలన్, ఎందుకలా నెగిటివ్ గా మారారు అన్నది మిగతా కథ.'చారులత' చిత్రంలో ప్రియమణి ఈ కవలల పాత్ర చేస్తున్నారు. థాయ్ చిత్రం 'అలోన్' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పోన్‌కుమరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియమణి పాత్రల పేరు 'చారు, లత'. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X