బాలయ్యను వదలని ప్రియమణి
బాలకృష్ణ, ప్రియమణి కాంబినేషన్లో వచ్చిన మిత్రుడు చిత్రం పెద్దగా వర్కవుట్ కాలేదన్న సంగతి తెలిసిందే. అలాగే బాలయ్య సరసన ప్రియమణి నప్పలేదంటూ కొన్ని కామెంట్స్ సైతం వినపడ్డాయి. అయితే మళ్ళీ బాలకృష్ణ ఆమెనే తన తాజా చిత్రంలో బుక్ చేయటంపై అందరలో ఆసక్తి నెలకొంది. రైడ్ చిత్రంతో నిరూపించుకున్న రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న భీష్మ చిత్రంలో మళ్ళీ ఈ జంట కనిపించనుంది. అయితే బాలకృష్ణే ఆమెను రికమెండ్ చేసాడంటూ కొన్ని రూమర్స్ సైతం వినపడుతున్నాయి.
ఇక బాలయ్య హీరోగా చేసే ఈ 'భీష్మ' చిత్రాన్ని బెల్లంకొండ పద్మావతి సమర్పణలో శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విశేషాలను నిర్మాత బెల్లంకొండ సురేష్ మీడియాకు తెలియచేసారు. 'మా శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ సంస్థ గతంలో బాలకృష్ణ కథానాయకుడిగా 'చెన్నకేశవరెడ్డి', 'లక్ష్మీనరసింహా' చిత్రాలను నిర్మించింది. ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రంగా 'భీష్మ' చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈనెల 5న షూటింగ్ ప్రారంభించనున్నాం అన్నారు.
అలాగే మా చిత్రంలో ప్రియమణి హీరోయిన్. ఇది సాంఘిక చిత్రం. బాలకృష్ణ వైవిధ్యమైన, పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం కథకు కచ్చితంగా సరిపోయే 'భీష్మ' అనే అద్భుతమైన టైటిల్ దొరికింది. బాలకృష్ణ స్టయిల్లోనే ఉంటూ, వైవిధ్యంగా ఉండే చిత్రమిది. ప్రథమార్థం వినోదాత్మకంగా, ద్వితీయార్థం యాక్షన్‌తో ఉంటుంది. సెంటిమెంట్‌కు కూడా చిత్రంలో ప్రాధాన్యం ఉంటుంది' అన్నారు. అయితే మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ చిత్రంలో ఉండనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











