ఆ హీరోయిన్ కోరికను తీర్చగలిగే దర్శక నిర్మాతలెవరో....
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన'నరసింహా"చిత్రం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీ అందరికీ ఆ చిత్రంలో హీరోయిన్ గా, విలన్ గా నటించిన రమ్యకృష్ణ తప్పకుండా గుర్తుకు వస్తుంది కదూ. సరిగ్గా అలాంటి క్యారెక్టర్ లో నటించాలనే కోరికతో రగిలిపోతుంది అందాల హాట్ బ్యూటీ ప్రియమణి, ఇటీవల ఓ సందర్భంలో ప్రియమణి మాట్లాడుతూ..'2010లో నేను నటించిన రక్తచరిత్ర, రావణ్, రగడ వంటి చిత్రాలు కలిసిరాలేదు. అయితే నా పాత్రలకు మాత్రం మంచి పేరు వచ్చింది అంటూ..మంచి లేడీ ఓరియంటెడ్ కథ వుంటే నేను నటించడానికి సిద్దంగా ఉన్నాను. రెమ్యునరేషన్ విషయంలో కూడా నేను పెద్దగా పట్టించుకోను"అని అంటోంది. మరి ప్రియమణి కోరికను తీర్చే ఆ దర్శక నిర్మాత లెవరో...


Click it and Unblock the Notifications











