బికినీతో ప్రియమణి బోణి

By Staff

Priyamani
ఇటీవలి కాలంలో తెలుగు తెరపై బికినీ వేసుకొని, అందాలు ఆరబోసిన హీరోయిన్స్ ఎవరూ లేరు. అందులోనూ త్వరలో టాలీవుడ్ లో బికినీ హీరోయిన్స్ ట్రెండ్ త్వరలో రానుంది. దానికి నాందీ ప్రస్తావనగా ప్రియమణి బికినీలో మొదట కనిపించి తన అందచందాలు పంచనుంది. తాజాగా నితిన్ సరసన ద్రోణ చిత్రంలో నటిస్తున్న ఆమె బికినీ సన్నివేశాలు హాట్ గా డైరక్టర్ కరుణకుమార్ చిత్రీకరించాడని తెలుస్తోంది. డి.ఎస్.రావు నిర్మిస్తున్న ఈ చిత్రం లోని ఆ హాట్ సన్నివేశాల షూటింగ్ హైదరాబాద్‌ శివార్లలోని ఓ రిసార్ట్స్‌లో ప్రియమణి ఈత దుస్తులు వేసుకున్న సన్నివేశాల్ని చిత్రీకరించారు.

'పెళ్త్లెన కొత్తలో', 'యమదొంగ' చిత్రాలతో కుటుంబ ప్రేక్షకుల్ని అలరించిన హీరోయిన్ ప్రియమణి. ఈమె ఈ మధ్య గ్లామర్‌ బాటపట్టింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ ఎవరికీ తీసిపోకుండా యూత్ ని ముఖ్యంగా మాస్‌నీ మెప్పించేందుకు సిద్ధమైంది. అందుకే 'ద్రోణ' సినిమాలో ప్రియమణి బికినీలో దర్శనమీయబోతోంది. ఈ మధ్యనే తమిళంలో 'బిల్లా' చిత్రంలో నయనతార టూపీస్‌ బికినీలో కనిపించి సంచలనం సృష్టించింది. దీని ఆధారంగా తెలుగులో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో కూడా అనుష్క ఆ పాత్రలో బికినీలో కనిపించబోతోంది. ఈ సినిమా కంటే ముందుగానే 'ద్రోణ' వస్తుంది... కాబట్టి అనుష్క కంటే కొద్ది నెలల ముందే తను బికినీలో కనిపించాలని ప్రియమణి భావించినట్లు సమాచారం.ఏదైమైనా భామల బికినీల పోటీ ఎలా ఉన్నా ప్రేక్షకులకు మాత్రం కనువిందే కదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X