విద్యా బాలన్, ప్రియమణి, త్రిషా బంధువులు తెలుసా? వారి మధ్య రిలేషన్ ఏమిటంటే?

సినీ తారల మధ్య బంధుత్వాలు అభిమానులకు, ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తాయి. ఇక స్టార్ హీరోలు, హీరోయిన్ల రిలేషన్స్ ఉన్నాయని తెలిస్తే మరింత ఆసక్తి రేపడం చాలా సహజం. అలాగే దక్షిణాదిలో, బాలీవుడ్‌లో తమ సత్తాను నిరూపించుకొంటున్న విద్యాబాలన్, ప్రియమణి, త్రిష మధ్య బంధుత్వాలు ఉన్నాయనే విషయం కొందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ.. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ 2 రిలీజ్ తర్వాత విద్యాబాలన్, ప్రియమణి మధ్య బంధుత్వాలు మరోసారి తెరపైకి వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమాలో ప్రియమణి నటన గురించి ప్రశంసిస్తూ విద్యాబాలన్ ఏం చెప్పారంటే...

Recommended Video

Samantha Akkineni Gets Twitter Emoji For Family Man Season 2 | Filmibeat Telugu
ది ఫ్యామిలీ మ్యాన్ 2 గురించి విద్యాబాలన్

ది ఫ్యామిలీ మ్యాన్ 2 గురించి విద్యాబాలన్

ఓటీటీలో రిలీజ్ అవుతున్న షేర్నీ ప్రమోషన్ బిజీలో ఉన్న విద్యాబాలన్ మీడియాతో మాట్లాడుతూ.. ది ఫ్యామిలీ మ్యాన్ సినిమా గురించి చాలా విన్నాను. ఈ వెబ్ సిరీస్ బాగుందని అందరూ ప్రశంసిస్తుంటే హ్యాపీగా ఉంది. షేర్నీ కారణంగా నేను ఆ సినిమాను చూడలేదు. ఎప్పుడెప్పుడూ చూడాలా అనే కోరిక ఉంది. నా కజిన్ ప్రియమణి ఫెర్ఫార్మెన్స్ బాగా ఉందని విన్నాను అని అన్నారు.

ప్రియమణి నాకు కజిన్

ప్రియమణి నాకు కజిన్

ప్రియమణి నాకు బంధువు. వరుసకు కజిన్. మా తల్లి తరుపున రిలేషన్ ఉంది. మా కుటుంబాల మధ్య అంతగా రిలేషన్స్ లేవు. కానీ ఓ అవార్డు ఫంక్షన్‌లో ప్రియమణిని కలిసిన తర్వాత మా ఇద్దరి మధ్య రిలేషన్ మరింత బలపడింది. అలా మళ్లీ మా కుటుంబాల మధ్య రిలేషన్స్ పెరిగాయి అని విద్యాబాలన్ అన్నారు.

 కెరీర్ పరంగా ప్రియమణి

కెరీర్ పరంగా ప్రియమణి

ప్రియమణి గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ.. ఆమె వండర్‌ఫుల్ యాక్టర్. కెరీర్ పరంగా ఆమె బాగా రాణిస్తున్నారు. ఆమె మరింతగా తన ప్రతిభను చాటుకొనే శక్తిని ఇవ్వాలని కోరుకొంటున్నాను అని విద్యాబాలన్ తెలిపారు. ప్రియమణిని తరుచూ కలుస్తుంటాను. ఫోన్‌లో సంభాషణలు కొనసాగుతుంటాయని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

త్రిషాతో ప్రియమణికి రిలేషన్

త్రిషాతో ప్రియమణికి రిలేషన్

ఇక త్రిష విషయానికి వస్తే.. ప్రియమణికి దగ్గరి బంధువు. తన తండ్రి తరఫున దగ్గరి బంధుత్వం ఉంది. వారిద్దరూ కూడా కజిన్స్ అవుతారు. అలా ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్ల మధ్య రిలేషన్ ఉంది. కానీ వారు ప్రొఫెషనల్‌గానే కనిపిస్తారు. కానీ బంధుత్వాలు బయటపెట్టుకోవడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది.

షేర్నీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే

షేర్నీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే

ఇక ఎన్టీఆర్ బయోపిక్ మూవీతో తెలుగు వారికి దగ్గరైన విద్యాబాలన్ నటించిన షేర్ని విషయానికి వస్తే శరత్ సక్సేనా, ఇలా అరుణ్, విజయ్ రాజ్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, అబుదతియా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. న్యూటన్ ఫేమ్ అమిత్ మసుర్కార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో జూన్ 18వ తేదీన రిలీజ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X