మళ్లీ ప్రియమణికి జగపతిబాబు పనికొస్తాడా?
క్రితం వారం రిలీజైన 'ప్రవరాఖ్యుడు' చిత్రానికి క్రేజ్ తేవటానికి ప్రియమణి, జగపతిబాబు కాంబినేషన్ రిపీట్ అవ్వటం కలిసి వచ్చింది. ఎందుకంటే అంతకు ముందు మదన్ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్త్లెన కొత్తలో' హిట్ సినిమా. అయితే 'ప్రవరాఖ్యుడు' డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇలాంటి పరిస్దుతుల్లో తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో 'సాధ్యం' అనే చిత్రం రిలీజుకు రెడీ అవుతోంది. దాంతో ఈ 'సాధ్యం' బిజినెస్ పై 'ప్రవరాఖ్యుడు' ఎఫెక్టు గ్యారింటీగా పడే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ 'సాధ్యం' చిత్రం ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు.
ఈ చిత్రం గురించి నిర్మాతలు కుమార్ బ్రదర్స్ మాట్లాడుతూ.. ''కథ, కథనాల్లో నవ్యత ఉంది. హీరో, హీరోయిన్స్ మధ్య చోటు చేసుకొనే సన్నివేశాలు ఆకట్టుకొనే రీతిలో ఉంటాయి. సగానికిపైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలాఖరు వరకు ఏకధాటి జరిగే షూటింగ్‌తో టాకీ పూర్తవుతుంది. జనవరిలో పాటలు చిత్రీకరించటానికి సన్నాహాలు చేస్తున్నాం. 'ఆది' చిత్రం ఫేం కీర్తిచావ్లా కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు'' అంటున్నారు. తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, ప్రగతి, మధుమణి తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్‌ప్లే: శ్యామ్ మనోహర్, మాటలు: శ్యామ్, మడూరి మధు; ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జి.హరినాథ్, ఎ.పాండురంగ, సంగీతం: చిన్నిచరణ్.


Click it and Unblock the Notifications











