జూ.ఎన్టీఆర్ అంటే పడిచస్తున్న ప్రియమణి!?!
జూనియర్ ఎన్టీఆర్ అంటే పడిచస్తోంది ప్రియమణి. యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన ప్రియమణి ఆ సినిమా ఘనవిజయం సాధించడంతోపాటు ఆమెకు పలు చిత్రాలలో నటించే అవకాశాలు వచ్చాయి. యమదొంగ సినిమా తరువాత తరుణ్ సరసన నవవసంతంలో నటించిన ప్రియమణి సినిమా షూటింగ్ కొనసాగినన్నాళ్లు తరుణ్ తో క్లోజ్ గా మూవ్ అయిందని, ఆ తరువాత ఆయన ప్రేమాయణాలు తెలిసిన తరువాత అయ్యే ఆ సినిమాలో ఎందుకు చేశానా అని కూడా అనుకుంది. ఆయనతో క్లోజ్ గా ఉండడం కూడా మానేసింది. ఇపుడు తన యమదొంగ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతోంది. జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ అద్భుతంగా చేస్తాడని, అంత యాక్టివ్ గా ఆయన మూవ్ మెంట్స్ ఉంటాయని, మళ్లీ ఆయన సినిమాలో నటించాలని ఉందని అంటోంది. తన డాన్స్ కూడా బాగుందని జూనియర్ ఎన్టీఆర్ అనడంతో ఎంతో సంతోషం వేసిందని ప్రియమణి అంటోంది.


Click it and Unblock the Notifications











