ప్రేమ వివాహం చేసుకోబోతున్న హీరోయిన్ ప్రియమణి
హైదరాబాద్: హీరోయిన్ ప్రియమణి ప్రేమ వివాహం చేసుకోబోతోంది. అయితే ఎప్పుడు? ఎవరిని? అనే విషయాలు మాత్రం ఇప్పుడే అడగొద్దు సుమీ. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రస్తుతం తెలుగుతో పాటు, మళయాలం, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రియమణి తన పెళ్లి గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది.
ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, మరో రెండేళ్ల తర్వాత ఆ విషయం గురించి ఆలోచిస్తాను అని అంటోంది. అయితే ఎప్పుడు చేసుకున్నా పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహమే చేసుకుంటానని స్పష్టం చేసింది ప్రియమణి. పెళ్లి అనేది జీవితంలో ఎంతో కీలకమైనది, అంత సులభంగా తీసుకునే నిర్ణయం కాదు....సరైన వ్యక్తిని ఎంచుకోక పోతే ఆ తర్వాత జీవితాంతం బాధ పడాల్సి వస్తోందని హిత బోధ చేస్తోంది.
ప్రియమణి ప్రస్తుతం తెలుగులో 'చండీ' చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం ఆడియో విడుదలైంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ఖరారు చేయనున్నారు. దీంతో పాటు 'అంగుళీక'అనే మరో తెలుగు చిత్రంలోనూ నటిస్తోంది. మళయాలంలో 'పేయింటింగ్ లైఫ్', కన్నడలో 'అంబరీష' చిత్రాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి.
ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ 'చెన్నై ఎక్స్‌ప్రెస్' ప్రత్యేక గీతం చేసిన ప్రియమణికి ఆ పాట హిట్టయినా....పెద్దగా క్రిడెట్ దక్కలేదనే చెప్పాలి. ఈ సినిమా హిట్ కావడంతో బాలీవుడ్లో ఆమె బిజీ అవుతుందని అనుకున్నారు కానీ....ఒక్క బాలీవుడ్ చాన్స్ కూడా రాక పోవడం ఆమె అభిమానులను నిరాశ పరిచింది.


Click it and Unblock the Notifications












