ప్రియమణి కారు యాక్సిడెంట్..సేఫ్

By Srikanya

కన్నడ చిత్రం అన్న బాండ్ షూటింగ్ కోసం బెంగుళూరు వెళ్తున్న ప్రియమణి కారు ..యాక్సిడెంట్ కు గురి అయ్యింది. అయితే అదృష్టం బాగుండటంతో కారుకి కొద్ది పాటి సొట్టలతో బయిటపడింది. కారులో ఉన్న వారెవరకీ ఏ విధమైన ప్రమాదమూ జరగలేదు. కారు సైడ్ ప్యానల్స్ మాత్రమే డ్యామేజ్ అయ్యీయి.ఇక తెలుగులో ఆమెకు సినిమాలు ఏమీ లేవు. ఆమె జగపతిబాబు సరసన నటించిన క్షేత్రం మాత్రం విడుదలకు సిద్దమైంది.

ఈ 'క్షేత్రం' సినిమాలో ప్రియమణి రెండు విభిన్న పాత్రలను పోషిస్తున్నారు. అందులో ఒకటి ట్రెండీ కేరెక్టర్ అయితే... మరొకటి చారిత్రక నేపథ్యంలో వచ్చే నాగపెంచలమ్మ పాత్ర. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రియమణి ఈ పాత్రలను పోషిస్తున్నట్టు చిత్రదర్శకుడు టి వేణుగోపాల్ చెప్పారు. ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలతో యువతరం అభిమానాన్ని చూరగొన్న ప్రియమణి.. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువ కానున్నారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

ఇంకా వేణుగోపాల్ మాట్లాడుతూ 'జగపతిబాబు పాత్ర ఈ కథకు వెన్నెముక. ఆయన కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర ఇది. 'కిక్" శ్యామ్ ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ప్రియమణి, కిక్ శ్యామ్ కాంబినేషన్ సన్నివేశాలు యువతరాన్ని ఉర్రూతలూగిస్తాయి' అన్నారు. నిర్మాత జి.గోవిందరాజు మాట్లాడుతూ 'నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా సాగుతున్న కథ ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకుంటుంది. ఆ మలుపే ఈ సినిమాకు హైలైట్. త్వరలో పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. దీపావళికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X