ప్రియమణి కొత్త చిత్రం 'లక్ష్మీ' ప్రారంభం
ప్రియమణి హీరోయిన్ గా కన్నడంలో లక్ష్మీ అనే చిత్రం షూటింగ్ గురువారం రాత్రి వైభవంగా బెంగుళూరు ప్రీడం పార్కు వద్ద ప్రారంభమైంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న 101వ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని రాఘవ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాఘవ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రవి భాస్కర్, శివరాజ్ కుమార్ లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇంతకుముందు తాను శివరాజ్ కుమార్ హీరోగా సత్య ఇన్ లవ్ చిత్రానికి దర్శకత్వం వహించానని గుర్తు చేశారు. టెరర్రిజం ప్రధానాంశంగా లక్ష్మీని తెరకెక్కిస్తున్నామని చెప్పారు. కథ, స్క్రీన్‌ప్లేలో కొత్తదనం ఉంటుందని అన్నారు.
అళాగే శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో మూడు విభిన్నమైన గెటప్ లలో కొత్తగా కనిపిస్తారని తెలిపారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు థ్రిల్ కు గురై సంతృప్తిగా థియేటర్ నుంచి బయటకు వస్తారని పేర్కొన్నారు. గురువారం నుంచి జనవరి 14 వరకు మొదటి షెడ్యూల్ జరుగుతుందని వివరించారు. అనంతరం హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా పేరు లక్ష్మీ అని తెలుసుకున్న వారు చాలా మంది ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అనుకుంటారని అన్నారు. అయితే కథ ప్రధానాంశంగా ఉంటుందని వెల్లడించారు.
ఈ సినిమాలో తన పాత్ర పేరు లక్ష్మీనారాయణ అని, అందుకే లక్ష్మీ అని పేరు పెట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రవి భాస్కర్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీస్తున్నామని, తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గురుకిరణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ముహూర్తం సందర్భంగా కన్నడ సినీ ప్రముఖులు, వ్యాపారులతో సహా పెద్దసంఖ్యలో శివరాజ్ కుమార్ అభిమానులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











