For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియమణి 'తూటా' పేలుతుందా?

    By Staff
    |

    బికిని వేసి అబిమానుల గుండెల్లో శృంగార బాంబులు పేల్చిన ప్రియమణి మరో సారి తూటాలు విసరటానికి రెడి అవుతోంది. తమిళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తూటా పేరుతో తెలుగులోకి అనువదించి రెడీ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో తమిళంలో రిలీజై వెళ్ళిపోయింది. అయితే తాజాగా ఈ మధ్యన ఆమెకొచ్చిన క్రేజ్ చూసిన వారు ఈ చిత్రం డబ్బింగ్ చేస్తున్నారు. నిజానికి ద్రోణ చిత్రం వల్ల దర్శక, నిర్మాతకు ఒరిగిందేమీ లేకపోయినా ప్రియమణి కి మాత్రం బాగా కలిసి వచ్చింది. జీవన్, ప్రియమణి జంటగా తమిళంలో రూపొందిన 'తూటా' (బుల్లెట్) చిత్రం ఇప్పుడు అదే పేరుతే తెలుగులో అనువాదమవుతోంది. ఈ చిత్రానికి సెల్వం దర్శకుడు.

    మే నెలలో సినిమా విడుదల చేస్తామంటున్న ఈ చిత్రం పూర్తి యాక్షన్ కథా చిత్రం. ఒక పోలీసు అధికారి అనాథ బిడ్డను చేరదీసి గూండాయిజం, రౌడీయిజం వంటివాటిలో తర్ఫీదు ఇచ్చి తాను చేయాలనుకుంటాడు. అయితే ఓ సంఘటనతో కనువిప్పు కలిగిన ఆ కుర్రాడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ప్రియమణి ఇన్ స్పెక్టర్ గా నటించింది. ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్ రెడ్డి మాటలు, వనమాలి పాటలు, సురేంద్రనాథ్ రెడ్డి ఎడిటింగ్, దళపతి శ్రీను పైట్స్, శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X