కాజల్ గురించి అడగొద్దు.. ఆమె సమస్యలో ఇరికించొద్దు: ప్రియమణి

By Srikanya

హైదరాబాద్ : కాజల్‌ గురించి నన్ను అడక్కండి. ఆమె సమస్యలో నన్ను చొప్పించకండి అంటూ రిక్వెస్ట్ చేస్తోంది ప్రియమణి. కాజల్ అగర్వాల్ కి ప్రముఖ దర్శకుడు భారతీ రాజా కి మధ్య జరుగుతున్న వివాదం విషయమై ప్రియమణిని మీడియా వారు....మిమ్మల్ని, కాజల్‌ని పరిచయం చేసింది భారతిరాజా. అయితే తాను నానాపటేకర్‌ చిత్రంలో నటించానని చెబుతోంది కాజల్‌. దీనిపై భారతిరాజా కూడా మండిపడ్డారే? అని ప్రశ్నస్తే ఇలా స్పందించింది.

అలాగే కాజల్‌ చెప్పిన విషయానికి భారతిరాజా అలా స్పందించి ఉంటారు. నన్ను పరిచయం చేసింది భారతిరాజానే. ఆయన్ను ఎప్పటికీ మరవలేను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఏ ఒక్కరన్నా గౌరవమే అని చెప్పుకొచ్చింది. మరి తమిళ పరిశ్రమలో హీరోయిన్స్ కు గౌరవం లేదని కాజల్‌ చెబుతున్నారే? అని అడగ్గా... మంచి, చెడుల విషయాల్లో తలదూర్చదలచుకోలేదు. నేను పలుభాషల్లో నటించాను. ఆ అనుభవంతో ఒక విషయం చెబుతున్నా. ప్రతి సినీ పరిశ్రమలోనూ కళాకారులకు మర్యాద ఇస్తారనేదే నా అభిప్రాయం అని తేల్చి పారేసింది.

ప్రియమణి ప్రస్తుతం తెలుగు, తమిళంలోనే కాక మలయాళం, కన్నడ చిత్రాల్లో కూడా హవా సాగిస్తోంది. దక్షిణాదిలో పేరు సంపాదించుకున్న ఈ చిన్నది ఇప్పుడు షారుఖ్‌ఖాన్‌ నటిస్తున్న హిందీ సినిమా 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'లో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' చిత్రీకరణ గురించి చెపుతూ.. అందులో ఒక పాటకు చిందులేస్తున్నా. రాజు సుందరం డ్యాన్స్‌మాస్టర్‌. షారుఖ్‌తో డ్యాన్స్‌ చేస్తున్నామనే ఆసక్తి, భయం కూడా ఉన్నాయి. తెలుగులో 'చండీ' అనే యధార్థగాథలోనూ నటిస్తున్నా. నిజంగానే కొత్త అనుభవం అంది.

ఇక ప్రస్తుతం జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌(సీసీఎల్‌) మ్యాచ్‌లన్నింటిలోనూ కనిపిస్తోంది. ఈ విషయమై ప్రశ్నించగా.. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, భోజ్‌పురి.. ఇలా పలు భాషల నటీనటులతో పరిచయం పెంచుకునేందుకు సీసీఎల్‌ వేదికగా నిలుస్తోంది. అలాంటి అవకాశాన్ని వదులుకుంటే ఎలా? అందరి గురించి తెలుసుకోగలుగుతున్నా. వారి ప్రతిభను కూడా గుర్తిస్తున్నా. స్నేహానికి చక్కని వారధిలా ఉంది అని శెలవిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X