మణిరత్నం దెబ్బకు కన్నీళ్ళపర్యంతమైన ప్రియమణి !
మణిరత్నం దర్శకత్వంలో తమిళ్, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'రావణ్". ఈ రెండు ఓ కీలకపాత్రను(సూర్సనక) ప్రియమణి పోషిస్తుందని సమాచారం. తమిళంలో విక్రమ్, హిందీలో అభిషేక్ బచ్చన్ లు నటిస్తుండగా, ఈ రెండు భాషల్లో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటిస్తుంది.
జాతీయ ఉత్తమ నటిగా పేరు తెచ్చుకున్న ప్రియమణి, ఆ చిత్రం తర్వాత ఆమె నటించిన మలయాళ చిత్రం 'తిరక్కథ" చిత్రంలో చేసిన నటనకు కూడా జాతీయ అవార్డ్ వస్తుందని ఆసించిందట. కానీ, ఆ పాత్రకు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పడంతో అవార్డ్ మిస్ అయ్యింది. అందుకే మంచి కథ ఉన్న చిత్రాలకు ఇకపై తానే డబ్బింగ్ చేసుకుంటానంటుంది ప్రియమణి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'రావణ" చిత్రంలో ఆమె పాత్రకు ఆమె డబ్బింగ్ చెప్పుకుంటుందని సమాచారం.
తమిళంతో పాటు హిందీ కూడా బాగా రావడంతో ఇకపై ఈ భాషల్లో వచ్చిన చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానంటుంది ప్రియమణి. ఈ చిత్రంలో ఎమోషన్ సీన్ లో తిరువల్వేలి యాసలో మాట్టాడాల్సి ఉండగా..ఆ సీన్ ను మణిరత్నం సమక్షలో అద్బుతంగా చేసిందట. అంతేకాకుండా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎంగో ఎమోషన్ కి గురైన ప్రియమణి, అది పూర్తయిన తర్వాత కన్నీటి పర్యవంతమయ్యిందనీ..ఆ సీన్ లో అంతగా లీనమై డబ్బింగ్ చెప్పడంతో కళ్ల వెంట నీరు ఆగలేదట ప్రియమణికి. అందుకే ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందంటున్నారు దర్శకనిర్మితలు.


Click it and Unblock the Notifications











