జూ ఎన్టీఆర్ తో మళ్ళీ ప్రియమణి హాట్ రొమాన్స్ ...
'యమదొంగ" చిత్రంలో ఎన్టీఆర్ తో జతకట్టిన ప్రియమణి మరోసారి ఈ నందమూరి అందగాడితో జతకట్టడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఈ భామకి ఇది మంచి ఆఫరే అని చెప్పాలి. అందాలు ఆరబోయడంలో ఎటువంటి పరిమితులు లేని ఈ కేరళ భామ ఇటీవలే హాట్ హాట్ గా ఫోటోసెషన్ కూడా చేయించుకుంది. ఇక ఆ ఫోటోలు ఎన్టీఆర్ దృష్టి లో పడ్డాయేమో..వెంటనే తారక్ తన తాజా చిత్రంలో ప్రియమణికి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి.
జూ ఎన్టీఆర్, సింహా డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రంలో ప్రియమణి నాయికగా ఎంపికయ్యిందని సమాచారం. ఆల్ రెడీ శృతిహాసన్ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఇక ప్రియమణికి దక్కింది రెండో హీరోయిన్ ఛాన్సే. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. కాగా వర్కింగ్ టైటిల్ గా 'దమ్ము" చిత్రానికి యంయం కీరవాణి సంగీతం అందించనున్నాడు.


Click it and Unblock the Notifications











