మేనమామ, మేనల్లుడు(నాగ్, సుమంత్) ఒకేసారి ప్రియమణితో...
నాగార్జున హీరోగా బిందాస్ ఫేమ్ వీరూ పోట్ల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా సెలక్టయింది. అయితే మొదట హీరోయిన్ గా అనూష్క చేస్తోంది. సెకెండ్ హీరోయిన్ గా ప్రియమణి సెలక్ట్ చేసారు. ఈ చిత్రాన్ని కామాక్షి కళామూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రియమణి మొదటసారిగా..నాగార్జున సరసన చేస్తోంది. అలాగే సుమంత్ తో కుమార్ బ్రదర్స్ నిర్మించే చిత్రంలోనూ ఆమె హీరోయిన్ గానూ చేస్తోంది. దాంతో మామ, అల్లుళ్ళతో ఒకేసారి చేస్తున్న ఘనత దక్కుతోంది. ప్రియమణి ఈ చిత్రాలు కాక కన్నడ, మళయాల చిత్రాల్లోనూ చేస్తోంది. పవన్ కళ్యాణ్ 'ఖుషి' చిత్రాన్ని ఇప్పుడు కన్నడలో తెరకెక్కిస్తున్నారు. అందులో ప్రియమణే హీరోయిన్. రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర' లో ఆమె సూర్య సరసన చేసింది. ఆ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానుంది.
More from Filmibeat
ప్రియమణి నాగార్జున సుమంత్ రావణ్ రక్త చరిత్ర గోలీమార్ priyamani nagarjuna sumanth raavan rakta charitra golimaar


Click it and Unblock the Notifications











