బాలకృష్ణతో మిత్రుడు చిత్రంలో నటించిన ప్రియమణి ఆయన్ని తెగపొగడేస్తోంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ తాను ఇప్పటివరకూ నటించిన హీరోలందరిలోకి బాలయ్యే నచ్చాడని, ఆయనతో చేయటం మర్చిపోలేని ఎక్సపీరియన్స్ అని అంటోంది. అలాగే బాలయ్య డైలాగులు చెప్పటంలోనూ, ఫైట్స్ లోనూ ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ లోనూ బాగా చేసారని, తనకు సైతం నటన లో కొన్ని సలహాలు ఇచ్చారని చెప్తోంది. ఇది గమనించిన తాజాగా ఓ టీవీ ఛానెల్ వారు టాక్ షో లో ఆమెను మీకు నచ్చిన హీరో ఎవరని అడిగారు. దానికి ఆమె చాలా ఇబ్బంది పడతూ ఇంకెవరూ..కమల్ హాసన్ అంది. అంతేగాక తెలుగు హీరోలంతా బాగా చేస్తారంటూ కితాబు ఇచ్చేసింది. ఎవరిని అంటే ఏమి ఇబ్బందో అని ఆమె తెలివిగా సమాధానం చెప్పింది. ఇక అదే షో లో మహదేవ్ మాత్రం మిత్రుడులో పాట కలుపుతున్నారనే విషయం నాకు తెలియదంటూ సమాధానమిచ్చి ఆశ్చర్యపరిచాడు.
Story first published: Tuesday, May 12, 2009, 17:59 [IST]