ప్రియమణి పబ్లిసిటి ట్రిక్కు

By Staff
Priyamani
'మా ఇద్దరి మథ్యా మీరనుకుంటున్నట్లుగా అంత సీనేమి లేదు. ఒట్టేసి చెపుతున్నా మాది ఒట్టి ప్రెండ్షిప్పే !' అంటోంది ప్రియమణి. దాంతో 'అవునూ ప్రియమణి ఎవరి గురించి ఇలా స్టేటమెంటిచ్చింది?' అని కొందరు కంగారుపడ్డారు. ఇంతకీ ఆమె చెబుతోంది.. 'ఆనంద్' రాజా గురించిట. 'అతను తో టాస్ లో చేసాను...యోదో అలా రెండు సార్లు లంచ్ చేసాను..అంత మాత్రానికే మా ఇద్దరి మద్యా యోదో ఉందనుకుంటే ఎలా..అతనో పక్కా జంటిల్ మెన్..అందుకే ప్రెండ్షిప్ .అంతే! అంతగా కాకపోతో రాజాని కాంటాక్ట్ చేయండ'ని సలహాలిస్తోంది. సర్లే ఇదంతా మేం నమ్ముతాంగాని అసలు నిన్నెవరు.ఈ విషయం గురించి అడిగారు...కల్పించుకుని మరీ చెప్తావెందుకు అని విసుక్కుంటున్నారు ఆ విన్నవాళ్ళు. కాని వాళ్ళూ ఊరుకోక ఆ వార్తని బాగా పబ్లిసిటీ చేసారు.బ్రిటన్ ప్రథాని చెప్పినట్లు 'నీ గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారా.. చెడుగా మాట్లాడుకుంటున్నారా ...అన్నది ఎప్పుడు ప్రశ్న కాదు...అసలు మాట్లాడుకుంటున్నారా లేదా అన్నది ప్రశ్న' అన్న మాటలు బాగా వంట బట్టించుకున్నట్లుంది ప్రియమణి. అందుకే బాలీవుడ్ భామలల్లాగ లేనిపోని రూమర్స్ ని వ్యాపింపచేసి ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకుంటోంది. అందులో చేతిలోనూ చెప్పుకోతగ్గ సినిమాలు లేవు. అందుకే అనవరసర ప్రయాస. రాజాది కూడా సేమ్ సిట్యువేషన్. యాక్షన్ సినిమాలతో ఎదిగిపోదామని చేసిన ప్రయత్నాలు యోమి ఫలించక దిక్కులు చూస్తున్నాడు. అందుకే వీళ్ళిద్దరూ జంటయ్యారనే పుకార్ల తయారీలో ఉన్నారు అంటున్నారు సీనియర్లు. వాళ్ళ సంగతి ప్రక్కనపెడితే నిప్పు లేనిదే పొగెందుకు వస్తుందనే సామెత గుర్తుచేస్తున్నారు మరికొందరు.

More from Filmibeat

Read more about: priyamani anand raja toss media press
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X