'రక్త చరిత్ర'లో ప్రియమణి పాత్ర ఏమిటంటే...
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రక్త చరిత్ర చిత్రంలో తాజాగా ప్రియమణికి స్ధానం దక్కింది. ఆమె మద్దెల చెరువు సూరి భార్య గంగుల భానుమతి పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. సూరి పాత్రను గజనీ సూర్య చేస్తున్న సంగతి తెలిసిందే. అనంతపురం ఫ్యాక్షన్ కక్షల నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తతం రెండో షెడ్యూల్ కి రెడీ అవుతోంది. పరిటాల రవిగా వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని వర్మ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దీంట్లో వివేక్ సరసన రాధికా ఆప్టే నటిస్తోంది. శతృఘ్నసిన్హా ఎన్టీఆర్ గా కథలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఇక ప్రియమణికి ఈ ఆఫర్ రావటంపై చాలా సంతోషంగా ఉంది. మరో ప్రక్క ఆమె మరో ప్రముఖ దర్శకుడు మణిరత్మ దర్శకత్వంలో రావణ్ చిత్రంలోనూ చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రియమణి రక్త చరిత్ర వివేక్ ఒబరాయ్ మద్దెల చెరువు సూరి రాధికా ఆప్టే శతృఘ్న సింహా priyamani raktha charitra vivek oberoi maddela cheruvu suri radhika apte


Click it and Unblock the Notifications