మనం లక్కీ పెయిర్ అంటూ జూ ఎన్టీఆర్ ని పీడిస్తున్నహీరోయిన్...!?
గత ఏడాది వరకు చాలా సినిమాలతో బిజీగా ఉన్న ప్రియమణి ఇప్పుడు చేతిలో 'క్షేత్రం" మినహఆ మరో చిత్రమే లేదు. దాంతో టెన్షన్ పడుతున్న ప్రియమణి తన స్నేహితులు, తనతో నటించిన హీరోలని వెంటాడుతూ తనకో అవకాశమివ్వమని పీడిస్తోందట. జూ ఎన్టీఆర్ తో యమదొంగ" చిత్రంలో నటించిన ప్రియమణి ఇప్పుడు అతడిని మరో సినిమాలో ఛాన్సిమ్మని అడుగుతోందట.
యమదొంగకి ముందు ఎన్టీఆర్ వరుస ప్లాపులతో ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కి మళ్లీ పునరుత్తేజాన్ని ఇచ్చిన యమదొంగని గుర్తు చేస్తూ, తమ పెయిర్ లక్కీ అని చెబుతూ ఇంకోసారి కలిసి నటిద్దామని వెంటాడుతోందట. త్రిషతో నటించడానికి జూ ఎన్టీఆర్ సిద్దం కావడం ప్రియమణికి ఆశలు రేకెత్తించింది. అందుకే అతని మలి చిత్రంలో అవకాశమిమ్మని ప్రియమణి అతడిని కోరుతోంది. జూ ఎన్టీఆర్ తలచుకుంటే ప్రియమణికి పనవుతుంది కానీ అతను తలుచుకుంటాడా అనేది అనుమానమిప్పుడు..


Click it and Unblock the Notifications











