నేను కొత్త రుచులు ఇస్తాననే డిమాండ్...ప్రియమణి
తెరపై రోజుకో హీరోయిన్ ని చూసుకొనేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.వాళ్ళకు ఎప్పుడూ కొత్త ముఖాలుకనపడాలి. వాళ్ళ రుచులు,అభిరుచులు ఎప్పటికప్పుడు మారిపోతూంటాయి. అలాంటప్పుడు తెరని కొన్నాళ్ళపాటు ఏలాలంటే...మనం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించాలి. నేను ఆ విషయంలో సక్సెస్...నేను నా నటనతో,డాన్స్ లతో కొత్త రుచులను ప్రేక్షకులను ఇస్తాను అందుకే నేను నిలబడ్డాను. అంతెందుకు రీసెంట్ గా నేను చేసిన 'రగడ' సినిమాలో నా డాన్స్ లు బాగున్నాయన్నారు.
కొత్త రుచులను ఆస్వాదించామనే అనుభూతిని ప్రేక్షకుడికి కలిగించాను అంది. అలాగే తాను 2010 లో రక్త చరిత్ర, రావణ్ పెద్ద దర్శకుల చిత్రాలు చేసినా కలసిరాలేదని అంటోంది. అయితే తన పాత్రకు మాత్రం ఈ రెండు సినిమాల్లో మంచి పేరే వచ్చిందని కాబట్టి కొంతలో కొంత తృప్తి చెందుతున్నానని అంది. గ్లామర్ పాత్రలు కన్నా తనలోని నటిని బయిటకు తీసే ఛాలెంజ్ పాత్రలంటే తను ప్రాణం పెడతానని, పరుత్తి వీరన్ లాంటి చిత్రాలు చేయటానికి అదే కారణమని వివరిస్తోంది. ప్రియమణి హీరోయిన్ గా కన్నడంలో లక్ష్మీ అనే చిత్రం రీసెంట్ గా ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications











