ఆర్.పి. పట్నాయక్‌తో కమిటైన హీరోయిన్ ప్రియమణి
హైదరాబాద్: 'బ్రోకర్', 'ఫ్రెండ్స్ బుక్', 'తులసీదళం' లాంటి చిత్రాలతో దర్శకుడిగా మారిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ త్వరలో కన్నడ చిత్రసీమలో కూడా తన టాలెంటు చూపేందుకు రెడీ అవుతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోయే ఈచిత్రంలో ఆర్.పితో కలిసి పని చేయడానికి కమిటైంది హీరోయిన్ ప్రియమణి.
ఈ చిత్రాన్ని ఎన్. శేషగిరిరావు సమర్పణలో వినోద్, శరవణ నిర్మిస్తున్నారు. ముగ్గురు హీరోలు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. మార్చి నెలలో చిత్రీకరణ పూర్తి కానుంది. ఈ చిత్రంలో ప్రియమణి పవర్‌ఫుల్ సీబీఐ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో షూటింగ్ జరుగుతోంది. బుధవారం నుంచి ప్రియమణి చిత్ర యూనిట్లో జాయిన్ అవుతారు.

ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తుందనే నమ్మకంతో ఉంది ప్రియమణి. తెలుగు, తమిళ బాషల్లో ప్రియమణికి డిమాండ్ తగ్గిన నేపథ్యంలో కన్నడ సీమలో పట్టు సాధించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కన్నడలో ఆర్పీ పట్నాయక్ గతంలో పలు చిత్రాలకు సంగీతం అందించారు. ఆ విధంగా ఆర్.పి అక్కడి ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమాకు అక్కడ మంచి స్పందనే వస్తుందని ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











