twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రివేంజ్ స్టోరీ ('చండీ' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రియమణి మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకి రెడీ అవుతుంది. చారులత క్షేత్రం వంటి సినిమాలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేసిన ప్రియమణి చండి అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. వి. సముద్ర డైరెక్షన్లో రానున్న ఈ సినిమా కథ వినగానే ప్రియమణి వెంటనే అంగీకరించింది అని దర్శకుడు చెప్పారు. పంచాక్షరి తరువాత వి. సముద్ర చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇదే. ఈ సినిమా కోసం ప్రియమణి విలు విద్య, గుర్రపు స్వారీ నేర్చుకుంటుంది. ఒమిక్స్ బ్యానర్ పై శ్రీను బాబు నిర్మించిన ఈ సినిమాకి ఎస్.ఆర్ శంకర్, చిన్న సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ రోజే విడుదల అవుతోంది.

    "రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ప్రజల్ని కాపాడిన ధీర వనిత 'చండీ'. ప్రతి మహిళకూ ధైర్యాన్నిచ్చే సినిమా అవుతుంది. నాయిక ప్రధాన చిత్రాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు సముద్ర. ఇది ప్రతీకార కథాచిత్రం. తనకూ, తన ఊరికీ జరిగిన అన్యాయానికి ఓ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకున్నదేనేది ఇందులోని ప్రధానాంశం. అల్లూరి సీతారామరాజు ప్రేరణతో చండీ పాత్రను మలిచి ఈ సినిమా తీశాం. ఇందులో అల్లూరి వారసునిగా అశోకగజపతిరాజుగా కృష్ణంరాజు, ఆయన కూతురు చండీగా ప్రియమణి కనిపిస్తారు. అల్లూరి సీతారామరాజుగా దివంగత ఎన్టీఆర్‌ను చూపించాం. ఆయన తెరమీద కనిపించినప్పుడల్లా ఆయన అభిమానులకు పండగే. పవర్‌ఫుల్ సీబీఐ ఆఫీసర్‌గా శరత్‌కుమార్ ఓ కీలక పాత్ర చేశారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా అద్భుతంగా వచ్చింది సినిమా. ప్రియమణి, కృష్ణంరాజు, శరత్‌కుమార్ పాత్రలతో పాటు క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్ అవుతుంది.

    కృష్ణంరాజు గారి జీవితాశయం నెరవేర్చే సినిమా ఇది. పార్లమెంట్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆయన కృషి సల్పుతున్నారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు తన ఆశయం ఫలవంతమైనంత ఆనందం కలిగిందని ఆయన చెప్పారు. ఈ సినిమాలో 'నేను రెబల్. నా వారసులు రెబల్. మా ఫ్యామిలీయే రెబల్‌రా', 'ప్రజల కోసం నేను, నా ఫ్యామిలీ ఒక్కసారి కాదురా వంద సార్లు చావడానికి సిద్ధంగా ఉన్నాం', 'చచ్చే ధైర్యం నాకుంది. చంపే ధైర్యం నీకుందిరా' అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి, ఈలలు వేయిస్తాయి.

    'ఖైదీ'లో చిరంజీవిలా, 'సింహా'లో బాలకృష్ణలా, 'గబ్బర్‌సింగ్'లో పవన్ కల్యాణ్‌లా, 'దూకుడు'లో మహేశ్‌లా, 'ఛత్రపతి'లో ప్రభాస్‌లా కనిపిస్తుంది 'చండీ'. ఆమె పాత్రలో ఇన్ని కోణాల్ని చూపించాం. ఆ పాత్రని గొప్పగా పోషించింది ప్రియమణి. జాతీయ ఉత్తమ నటి అనే దానికి పరిపూర్ణమైన న్యాయం చేసింది. ఈ సినిమాకి హీరో, హీరోయిన్ రెండూ ప్రియమణే. నా హిట్ సినిమాలైన సింహరాశి, శివరామరాజు, మహానంది, ఎవడైతే నాకేంటి, అధినేత వరుసలో 'చండీ' తప్పకుండా చేరుతుంది. నా కెరీర్‌లో, ప్రియమణి కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవారు తొలి సినిమాగా 'చండీ'ని నిర్మించారు. కథను నమ్మి ప్రియమణి ఇమేజ్‌కి మూడు రెట్లు ఎక్కువగా బడ్జెట్ పెట్టారు. సినిమా చూశాక చాలా మంచి సినిమా తీశామని సంతోషపడ్డారు.

    'గబ్బర్‌సింగ్'లోని అంత్యాక్షరిని పేరడీ చేసి పోసాని కృష్ణమురళిపై చిత్రీకరించాం. ఇటీవల పలు చిత్రాల విజయంలో పోసాని కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇందులో ఆయన పోలీస్‌గా వినోదాన్ని పంచుతారు. ఆయనతో పాటు అలీ, తెలంగాణ శకుంతల, సత్యం రాజేశ్, తాగుబోతు రమేశ్, చిత్రం శ్రీను కామెడీని పండించారు. ఆశిశ్ విద్యార్థి, జీవీ, సుప్రీత్, ఆజాద్, సత్య, వినోద్‌కుమార్ విలన్లుగా నటించారు. కొత్త సంగీత దర్శకుడు యస్.ఆర్. శంకర్ అందించిన బాణీలు ఇప్పటికే అందరినీ అలరిస్తున్నాయి. 'గంగా గంగా', 'అల్లూరి' పాటలతో పాటు 'కెమెరామన్ గంగతో రాంబాబు', 'ఎవడు'లో ఐటమ్ సాంగ్స్ చేసిన స్కార్లెట్ విల్సన్‌పై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ బాగా అలరిస్తాయి.

    సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే అంశాలతోటే మొదట్నించీ నేను సినిమాలు తీస్తూ వస్తున్నా. ఇది కూడా ఆ కోవలోనే ఉంటూ, కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని సినిమా అవుతుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు 'నిర్భయ కనుక ఇందులో మాదిరిగా ఉంటే తనను తాను కాపాడుకునేది. నిజంగా చాలా మంచి సినిమా చూశాం' అని అభినందించినప్పుడు చాలా ఆనందమేసింది.

    బ్యానర్ : ఒమిక్స్ క్రియేషన్స్
    నటీనటులు: ప్రియమణి,కృష్ణం రాజు, శరత్ కుమార్, నాగబాబు, వినోద్‌కుమార్, ఆశిష్ విద్యార్థి, సుప్రీత్, జీవి, ఆలీ, గిరిబాబు, ఎం.ఎస్., రంగనాథ్, కాదంబరి కిరణ్ తదితరులు
    సంగీతం: ఎస్.ఆర్.శంకర్, చిన్నా,
    ఫొటోగ్రఫీ: వాసు,
    ఎడిటింగ్: నందమూరి హరి,
    కథ, మాటలు: కరణం పి.బాబ్జీ,
    సమర్పణ: జగన్నాథనాయుడు,
    నిర్మాత: జి.శ్రీనుబాబు.
    స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.సముద్ర
    విడుదల తేదీ:08,నవంబర్,2013

    English summary
    Now Priyamani is coming as Chandi on this Friday 08 Nov 2013. Prime attraction of Chandi Telugu Movie would be Priyamani. Promo pics reveal that her role has been crafted as like a Hero. It seems that Punch dialogues and sword fights have been done excellently by her. Film unit says she has done all fights on her own and not used any duplicates. Krishnam Raju and Sarath Kumar have great padding support in Chandi. Samudri is fascinated to deal these type of stories. He has not enjoyed any hit for so long. He is trying to prove himself with this movie. This story relates to many generations. It is learnt that the story is about a woman’s fight against SEZ, government and land grabbers. This movie is also planned for remake to Hindi, subject to success in Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X