డబుల్ హర్రర్ (‘చారులత’ప్రివ్యూ)
హైదరాబాద్ : ప్రియమణి అవిభక్త కవలలుగా నటించిన చిత్రం 'చారులత'. పొన్ను కుమరన్ దర్శకత్వంలో తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషల్లో ఇది రూపొందిన ఈ చిత్రం రేపు(21,సెప్టెంబర్ 2012) ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ చిత్రం విడుదలవుతోంది. అవిభక్త కవలల పాత్రను సవాల్‌గా తీసుకుని చేశానని, సిపిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే విధంగా ఉంటుందని ప్రియమణి చెప్పారు.
కథ ప్రకారం ...చారు, లత... ఇద్దరూ వేర్వేరు కాదు. అతక్కుని మరీ పుట్టారు. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. ఈ ఇద్దరిదీ విడదీయరాని బంధం. కానీ అతుక్కున్న శరీరాలతో జీవితం కష్టం కాబట్టి... విడిపోవడానికి సిద్ధపడతారు. ఈ నేపథ్యంలోనే ఒక యువకుడు వారి జీవితాల్లోకి ప్రవేశిస్తాడు. 'ప్రేమ' అంటాడు. ఆ ప్రేమ కారణంగా చారు, లత జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి? అనే అంశంతో రూపొందిన చిత్రం 'చారులత'. ఈ చిత్రంలో ప్రియమణి పాత్రల పేరు 'చారు, లత'. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు.
''పుట్టుకతోనే ప్రియమణిది తన సోదరితో విడదీయలేని బంధం. ఎందుకంటే శరీరాలు కలిసి జన్మించిన అవిభక్త కవలలు వారు. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంపై ప్రేమ అనే అంశం ఎలాంటి ప్రభావాన్ని చూపిందన్నదే అసలు కథ. అందులో ఒకరు విలన్ గా మారి మరొకరి జీవితంతో ఆడుకుంటారు. ఎవరు విలన్, ఎందుకలా నెగిటివ్ గా మారారు అన్నది మిగతా కథ. . థాయ్ చిత్రం 'అలోన్' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ప్రియమణి మాట్లాడుతూ ''ప్రయోగాలకు నేనెప్పుడూ సిద్ధమే. దేహం ఒకటే.. శిరస్సులే రెండు. చారు.., లత. ఈ పా త్రల ను ఛాలెంజింగ్‌గా చేశాను. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. నేనుగా వెతికినా దొరకని అవకాశమిది' అన్నారు. అవిభక్త కవలలుగా ప్రియమణి నటన అందర్నీ ఆకట్టుకొంటుంది. ఉత్కంఠ కలిగించేలా ఉంటుందీ హారర్ చిత్రం. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని''అని నిర్మాత చెప్తున్ననారు
నటీనటులు : ప్రియమణి, సీత, శరణ్య, ఆర్తి తదితరులు
ఛాయాగ్రహణం: ఎన్.వి.పన్నీర్ సెల్వం,
సంగీతం: సుందర్ సి.బాబు.
దర్శకత్వం : పొన్ను కుమరన్
నిర్మాత :రమేష్ కృష్ణమూర్తి
విడుదల తేదీ : 21,సెప్టెంబర్ 2012


Click it and Unblock the Notifications











