ప్రియమణి 'చారులత' రిలీజ్ తేదీ ఖరారు
హైదరాబాద్: ప్రియమణి అవిభక్త కవలలుగా నటించిన చిత్రం 'చారులత'. పొన్ను కుమరన్ దర్శకత్వంలో తెలుగుతోపాటు తమిళ, కన్నడ భాషల్లో ఇది రూపొందింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 14 న విడుదల చేయటానికి తేదీ ఖరారు చేసారు. ఫస్ట్ లుక్ విడుదలకే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పంపిణీ సంస్ధ గీతా డిస్ట్ర్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. గీతా వారు తీసుకోగానే ట్రేడ్ లో ఈ చిత్రంపై మంచి ఆసక్తి కలిగింది. ఇక ఈ చిత్రంలో ప్రియమణి అవిభక్త కవలలుగా కనిపించి అలరించనుంది. ప్రియమణి చేస్తున్న ఈ రెండు పాత్రలులో ఆమె డిపెరెంట్ గా ఉండబోతోంది.
చిత్రం కథ విషయానికి వస్తే''పుట్టుకతోనే ప్రియమణిది తన సోదరితో విడదీయలేని బంధం. ఎందుకంటే శరీరాలు కలిసి జన్మించిన అవిభక్త కవలలు వారు. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంపై ప్రేమ అనే అంశం ఎలాంటి ప్రభావాన్ని చూపిందన్నదే అసలు కథ. అందులో ఒకరు విలన్ గా మారి మరొకరి జీవితంతో ఆడుకుంటారు. ఎవరు విలన్, ఎందుకలా నెగిటివ్ గా మారారు అన్నది మిగతా కథ.
ఈ చిత్రంలో ప్రియమణి పాత్రల పేరు 'చారు, లత'. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరిస్తున్నారు. తమిళ చిత్రం 'పరుత్తివీరన్'తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సాధించారు ప్రియమణి. ఆమెకు మరో జాతీయ అవార్డుని తెచ్చిపెట్టే చిత్రం ఇది అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మరి సినిమా మొత్తం చారు, లత అతుక్కునే ఉంటారా లేక శస్త్ర చికిత్స ద్వారా విడదీస్తారా? అనేది ప్రస్తుతానికి సీక్రెట్. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరిస్తున్నారు.
'చారులత' చిత్రంలో ప్రియమణి ఈ కవలల పాత్ర చేస్తున్నారు. థాయ్ చిత్రం 'అలోన్' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పోన్‌కుమరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియమణి పాత్రల పేరు 'చారు, లత'. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరిస్తున్నారు. తమిళ చిత్రం 'పరుత్తివీరన్'తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సాధించారు ప్రియమణి. ఆమెకు మరో జాతీయ అవార్డుని తెచ్చిపెట్టే చిత్రం ఇది అవుతుందనే అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











