‘మెగా’ ప్రొడ్యూసర్‌తో ప్రియమణి!
ప్రియమణి ద్విపాత్రాభినయం చేస్తున్న త్రిభాషా చిత్రం 'చారులత'. ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు నిర్మిస్తుండటం విశేషం. చారులత తెలుగు వెర్షన్‌ను మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. థాయ్ మూవీ 'Alone' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదో అవిభక్త కవలల కథ. ఈ రెండు పాత్రల్లో ఓ అమ్మాయి పేరు చారు, మరో అమ్మాయి పేరు లత. ఒకమ్మాయి దూకుడు మనస్తత్వం గలది అయితే, మరో అమ్మాయి అమాయకురాలు. అంతటి వైరుధ్యం వుంది ఈ పాత్రల నడుమ ఈ చిత్రం నడుస్తుంది.
కె.భాగ్యరాజా, కె.ఎస్.రవి కుమార్ వద్ద శిష్యునిగా పని చేసిన పొన్ కుమరన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు చెపుతూ... ఇటువంటి ఇతివృత్తంతో ఇంతవరకూ ఇండియన్ ఇండస్ట్రీలోనే సినిమా రూపొందలేదు. తొలిసారిగా ఇలాంటి కథతో ముందుకు వస్తున్నాం అన్నారు.
అయితే చారు, లత శరీరాలు సినిమా మొత్తం అతక్కునే ఉంటాయా ! లేక సర్జరీ ద్వారా విడదీస్తారా ! విడదీస్తే ఏమయ్యారు ? అన్న విషయాలు సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. ఏమైనా ఈ రెండు పాత్రలు పోషించడం కష్టంగా ఉందనీ, పాత్రల పోషణలో చాలా ఇన్వాల్వ్ అవుతున్నానని ప్రియమణి చెబుతోంది. తెలుగులో అవకాశాలు కోల్పోయిన ఈ ముద్దుగుమ్మకు కన్నడ పరిశ్రమ పెద్దపీట వేస్తోంది.
కాగా ఈ చిత్రంతో ప్రియమణి మరోసారి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంటుందని అంటున్నారు. రెండు పాత్రలు వైరుధ్యంతో సాగుతాయనీ, ఒక పాత్రలో పూర్తి అందాల ఆరబోతకు ప్రాధాన్యమిస్తే మరొకటి కథకు ప్రాణంగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ప్రియమణికి మళ్లీ మరో బ్రేక్ రాబోతుందన్నమాట. చాలా కాలంగా సరైన హిట్ లేని ప్రియమణికి అవకాశాలు చాలా వరకు తగ్గి పోయాయి. మరి ఈచిత్రంతోనైనా ప్రిమయణి పుంజుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications












