»   » శుక్రవారం..ప్రియమణి హాట్ హాట్ సీన్స్

శుక్రవారం..ప్రియమణి హాట్ హాట్ సీన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రియమణి అబిమానులు ఈ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే...ప్రియమణి,జగపతిబాబు కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ తెరకెక్కిన చిత్రం 'సాధ్యం' ఈ వారం రిలీజవుతోంది ఈ చిత్రంలో ఆమె రెచ్చిపోయి నటించటమే ఈ క్రేజ్ కు కారణం. అందులోనూ టీవీల్లో వస్తున్న ప్రోమోలు కూడా యూత్ ని వేడిక్కించే రీతిలో కట్ చేసారు. మరో ప్రక్క ఆమె ఫోటోలు...ద్రోణ చిత్రం తర్వాత మళ్ళీ ఇంటర్నెట్ లో డిమాండ్ లోకి వచ్చాయి. దాంతో ఈ చిత్రానికి మంచి ఓపినింగ్స్ వస్తాయని అందరూ ఆశిస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రియమణి..సుహాని అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది. జీవితంలో తనకు ఎదురైన సమస్యలను పరిష్కరించుకుంటూ తన లక్ష్య సాధనకు కృషి చేసే అమ్మాయి పాత్ర ఆమెది. ఇంతవరకూ తాను ఇలాంటి పాత్రను పోషించలేదని ప్రియమణి చెబుతోంది. పాత్ర స్వభావాన్ని బట్టి ప్రియమణి ఇందులో 'డేర్ ఫీట్స్' చేస్తుందని, అవి ప్రేక్షకులను కన్నార్పకుండా చేస్తాయని దర్శక,నిర్మాతలు ఇంటర్వూలలో చెప్తున్నారు. ఇక జగపతిబాబు అయితే 'ద్రోణ' చిత్రంలో చూపించనిన బికినీ అందాలుని మించి ఈ 'సాధ్యం' లో ప్రదర్శించిందని అంటున్నాడు. అంటే ఈ శుక్రవారం ఆమె అభిమానులుకు పండగే..ప్రస్తుతం ప్రియమణి పూరీ దర్శకత్వంలో గోలీమార్ చిత్రంలోనూ, వర్మ చేస్తున్న రక్త చరిత్ర లోనూ, మణిరత్నం...రావణ్ లోనూ ఆమె చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu