ఎవరికి వాళ్ళు గొప్పే, కానీ జూ.ఎన్టీఆర్‌ని మాత్రమే.. పబ్లిసిటీ కోసమే కొందరు.. ప్రియమణి!

Recommended Video

Priyamani Sensational Comments On Jr NTR | Filmibeat Telugu

అందం, అభినయం కలబోసిన నటి ప్రియమణి. ప్రియమణి ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. తాను చెలనుకున్న పని చేసుకుంటూ వెళ్లిపోతారు. నటిగా ప్రియమణి ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకుంది. దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ నటించి విజయాలు సొంతం చేసుకుంది. దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం సంచలనం రేపింది. ముఖ్యమంగా బాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. చాలా మంది నటీమణులు మీటూ ఉద్యమంలో పాల్గొని తమకు ఎదురైన లైంగిక వేధింపులని బహిర్గతం చేశారు. తాజాగా ప్రియమణి మీటూ ఉద్యమం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు

ఉత్తమ నటిగా జాతీయ అవార్డు

ప్రియమణి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. 2006లో విడుదలైన పేరుత్తివీరన్ చిత్రంలో నటనకు గాను ప్రియమణి జాతీయ అవార్డు అందుకుంది. ప్రియమణి తెలుగులో పెళ్ళైన కొత్తలో, యమదొంగ, హరే రామ్ లాంటి హిట్ చిత్రాలలో నటించనుంది. ప్రియమణి అవసరమైన చిత్రాల్లో అందాలని సైతం ఆరబోసింది. వివాహం తరువాత ప్రియమణి నటనకు దూరమైంది.

ఉద్యమాలు జరగాలి

ఉద్యమాలు జరగాలి

ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ మీటూపై స్పందించారు. ప్రస్తుత సమాజంలో సమస్యలు బయటకు రావాలంటే ఉద్యమాలు జరగాలని ప్రియమణి అన్నారు. మీటూ ఉద్యమం సరైనదే అని అభిప్రాయపడ్డారు. చాలా మంది నటీమణులు తమని వేధించారని ధైర్యంగా చెప్పుకోగలుతున్నారంటే మీటూ ఉద్యమం వలనే అని ప్రియమణి తెలిపింది.

కొందరు పబ్లిసిటీ కోసం

కొందరు పబ్లిసిటీ కోసం

భయపడకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడగలిగితే ఇలాంటి విషయాల గురించి అందరికి ఓ అవగాహన ఏర్పడుతుంది అని ప్రియమణి తెలిపింది. కొందరు ఈ ఉద్యమాన్ని పబ్లిసిటి కోసం ఉపయోగించుకుంటున్నారని ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఆశయం కోసం జరుగుతున్న ఉద్యమంలో ఇలా పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తూ కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రియమణి వ్యాఖ్యానించింది.

జూ. ఎన్టీఆర్ మాత్రమే

జూ. ఎన్టీఆర్ మాత్రమే

ఇదే ఇంటర్వ్యూలో ప్రియమణి తనకు నచ్చిన నటుడి గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించింది. టాలీవుడ్ లో చాలా మంది గొప్ప నటులు ఉన్నారు. ఎవరికి వారు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నారు. తాను మాత్రం వ్యక్తిగతంగా జూ. ఎన్టీఆర్ ని ఇష్టపడతానని తెలిపింది. తారక్ మనసున్న ఉత్తమ నటుడు అంటూ ప్రశంసల్లో ముంచెత్తింది. ప్రియమణి, ఎన్టీఆర్ జంటగా యమదొంగ చిత్రంలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X