twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ల జీవితాలు దారుణం.. స్టార్ హీరోయిన్లపై ప్రియమణి విసుర్లు

    |

    మీటూ కామెంట్స్ వినిపించి చాలా కాలమవుతోంది. హీరోయిన్స్ చాలా వరకు వారికి ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. అయితే వారు చేస్తున్న కామెంట్స్ గతంలో మాదిరిగా వైరల్ అవ్వడం లేదు. ఇక సినీ ఇండస్ట్రీలో ఎవరు కూడా ఇప్పుడు మీటూ కామెంట్స్ ని పట్టించుకోవడం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల ప్రియమణి ఇండస్ట్రీలో ఉంటున్న హోరోయిన్స్ పరిస్థితులపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది.

    హీరోయిన్ల జీవితాలు దారుణం

    హీరోయిన్ల జీవితాలు దారుణం

    సినీ పరిశ్రమలో ఓ వర్గానికి చెందిన హీరోయిన్స్ జీవితాలు మరీ దారుణంగా మారాయి అంటూ.. ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ప్రియమణి ప్రస్తుతం హీరోయిన్ గా అయితే కొనసాగడం లేదు. ఇక పలు రియాలిటీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు గెస్ట్ రోల్స్ లో దర్శనమిస్తోంది. ఇకపోతే ఇటీవల హీరోయిన్స్ జీవితాల గురించి తనదైన శైలిలో కొన్ని కామెంట్స్ చేసింది.

    హీరోల డామినేషన్ అంటూ

    హీరోల డామినేషన్ అంటూ

    హీరోల డామినేషన్స్‌పై పరోక్షంగా ప్రియమణి సెటైర్స్ వేసింది. కొంతమంది స్టార్ హీరోయిన్స్‌కి కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. సమంత - నయనతార - అనుష్క లాంటి వాళ్ళకు మాత్రమే రెమ్యునరేషన్ భారీగా ఇస్తున్నారని టాలెంట్ ఉన్న మిగతా హీరోయిన్స్‌కి మాత్రం ఆ రేంజ్ లో గౌరవం దక్కడం లేదని కామెంట్ చేసింది. ఇలా హీరోయిన్లపై పరిశ్రమలో కొనసాగుతున్న వేధింపులపై గళం విప్పడంపై సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

    కష్టానికి ఫలితం దక్కడం లేదు

    కష్టానికి ఫలితం దక్కడం లేదు

    హీరోయిన్లు పడ్డ కష్టానికి ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదు. ముందుగా ఒప్పందం ప్రకారం ఇచ్చే కొంత రెమ్యునరేషన్ కోసం చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఇలా చాలా మంది మధ్య తరగతి హీరోయిన్స్ జీవితాలు దుర్భరంగా మారుతున్నట్లు ప్రియమణి కామెంట్స్ చేసింది. ఇలాంటి పరిస్థితులపై అగ్ర హీరోయిన్లు, హీరోలు స్పందించాల్సిన అవసరం ఉంది అని ప్రియమణి పేర్కొన్నది.

    Recommended Video

    Naarappa Movie Intresting Update | Victory Venkatesh | Priyamani
    కనీస పారితోషికం ఇవ్వడం లేదు

    కనీస పారితోషికం ఇవ్వడం లేదు


    చాలా వరకు విజయాలు దక్కుతున్నప్పటికి కొంతమంది హీరోయిన్స్ కి కనీస పారితోషికం కూడా ఇవ్వడం లేదని చెప్పిన ఈ నేషనల్ అవార్డ్ విన్నర్ క్యాస్టింగ్ కౌచ్ పై కుడా డైరెక్ట్ గా సెటైర్స్ వేసింది. లైంగిక వేధింపులకు గురైన వారిపైనే ఇప్పుడు ఎక్కువ మంది హేళన చేస్తున్నారని తప్పు చేసిన వారికి శిక్షలు పడటం లేదని ప్రియమణి వాబోయింది. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో మాత్రమే క్యాస్టింగ్ కౌచింగ్ లేదని అందరిని ఆకర్షించే పరిశ్రమ కాబట్టి అందువల్ల ఫోకస్ ఎక్కువ ఇక్కడే ఉంటుందని వివరణ ఇచ్చింది.

    English summary
    National award winner priyamani about film industry casting couch. Also priyamani comments on anushka, samantha remuneration.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X