twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియమణి నుంచి అదే కోరుతున్నారా?

    By Staff
    |

    Priyamani
    ద్రోణ చిత్రంలో బికినీ వేసుకుని కొత్త ఎక్సపీరియన్స్ ప్రేక్షకులకు ఇవ్వటానికి ప్రయత్నించానని ప్రకటించిన ప్రియమణికి ఎప్పటినుంచో కన్నడంలో నటించాలనే కోరకట. ఇప్పుడా కోరక తీరబోతోందంటూ సంతోషంగా చెప్తోంది. కన్నడంలో కూడా ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో సూపర్ హిట్టయిన రెడీ చిత్రానికి రీమేక్ గా తయారవుతున్న చిత్రంలో ఆమె జెనీలియా పాత్రను చేస్తోంది. ఆ చిత్రం టైటిల్ రామ్. ఇందులో పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేస్తున్నాడు. అతను గురించి ప్రియమణి చెబుతూ..'పునీత్ నటించిన సినిమా ఒక్కటి కూడా పూర్తిగా చూడలేదు. అయితే ఆయన సినిమాల్లోని పాటలు టీవీలో చూశాను. చాలా మంచి డాన్సర్. ఒక సరైన ప్రాజెక్ట్ ద్వారా కన్నడంలో అడుగుపెడుతుండటం చాలా సంతోషంగా ఉంది' అంది.

    ఇక ఈ చిత్రాన్ని మదేష్ దర్శకత్వంలో ఆదిత్య రామ్ నిర్మించనున్నారు. కన్నడ సినిమాల్లో నటించాలనే కోరిక సరైన సమయంలో తీరడం సంతోషంగా ఉందని ప్రియమణి చెబుతోంది. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణతో కలిసి నటిస్తున్న 'మిత్రుడు' చిత్రంలో టాకీ పార్ట్ పూర్తి చేశాననీ, ఒక్క పాట చేయాల్సి ఉందనీ, అలాగే మణిరత్నం 'రావణ' చిత్రం కోసం పది రోజుల కాల్షీట్లు ఉన్నాయనీ తెలిపింది. వీటితో పాటు తమిళంలో రెండు చిత్రాలు వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ప్రియమణి 'రామ్' సైతం ఈ మంగళవారమే బెంగుళూరులో మొదలైంది. ఇక ఇదంతా బికినీ మహత్యమేని పరిశ్రమ పరిశీలకులు అంటున్నారు. ఆమె అలా డేరింగ్ గా నటించటం వల్లే అన్ని భాషల వారు కన్ను ఆమెపై పడిందని చెప్తున్నారు. అంటే కన్నడ వారు కూడా ఆమెనుంచి బికినీ రేంజి ఎక్సపోజింగ్ ఎక్సపెక్ట్ చేస్తున్నారన్నమాటేగా.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X