గతం ఓ చేదు అనుభవం...ప్రియమణి
అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగేదాన్ని. మేకప్ టెస్ట్ చేసేవారు. కబురు పంపుతాం అని చెప్పేవారు. ఇక ఆ కబురు కోసం కళ్లలో కాయలు కాసేలా ఎదురుచూసేదాన్ని. పిలుపు మాత్రం వచ్చేది కాదు. నాకు అదృష్టం రాత్రికి రాత్రే తలుపు తట్టలేదు. అంటోంది ప్రియమణి గతాన్ని గుర్తు చేసుకుంటూ. అయితే ఆ రోజులు జ్ఞాపకం వస్తే... ఏదో తెలియని ఆనందం. కనీసం బైకు కూడా నాకు ఉండేది కాదు. ఇప్పుడు ఖరీదైన కారులో తిరుగుతున్నాను. ఇదంతా దేవుడిచ్చిన వరమే అని చెప్పుకొచ్చారామె. గతం తాలూకు చేదు అనుభవాలు కూడా తనకి ఆనందమే ఇచ్చాయంటోంది. అయితే ఈ రోజు దక్షిణాది టాప్ స్టార్స్‌లో నేనూ కూడా ఒకదాన్ని. ఇది నిజం. ఇదంతా నా గొప్పతనం అని నేను అనుకోను. నాకొచ్చిన అవకాశాలు గొప్పవి అంతే...అంటోంది. ప్రస్తుతం ఆమె నటించిన సాధ్యం చిత్రం రిలీజవుతోంది. అలాగే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా చేస్తున్న గోలీమార్ లో ఆమె హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











