ఎవర్నీ చెడకొట్టడం లేదు...ప్రియమణి
సినిమా ఫీల్డు మొత్తం చెడిపోయిందని, సినిమాలు చూసి జనం పాడయిపోతున్నారని రకరకాలుగా రాస్తూంటారు..అంటూంటారు. అయితే మేము ఎవర్ని చెడగొట్టడం లేదు. జనం సినిమాల వల్ల బాగుపడతారు కూడా..మంచి,చెడు అనేవి మనం చూసే దృష్టి కోణాన్ని బట్టే ఉంటాయి అంటూ క్లాస్ పీకుతోంది ప్రియమణి. ఆమెను ఎక్సపోజింగ్ గురించి ప్రశ్నించినప్పుడు ఇలా సుదీర్ఘంగా స్పందించింది. ఇక ప్రస్తుతం ప్రియమణి..రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన రక్త చరిత్ర పార్ట్-2 చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఆ చిత్రం ఆమెకు తిరిగి బిజీ చేస్తుందని నమ్ముతోంది. అలాగే ఆమె సుమంత్ సరసన వియన్ ఆదిత్య దర్శకత్వంలో కుమార్ బ్రదర్శ్ నిర్మిస్తున్న రిమ్ జిమ్ టైటిల్ తో నిర్మతమువుతున్న చిత్రంలోనూ, నాగార్జున సరసన వీరూపోట్ల దర్శకత్వంలో రూపొందుతున్న రగడ చిత్రంలోనూ చేస్తోంది.
ప్రియమణి రావణ్ రక్త చరిత్ర రిమ్ జిమ్ రగడ నాగార్జున సుమంత్ priyamani raavan rakta charitra ragada nagarjuna


Click it and Unblock the Notifications