సినిమా వంద రోజులు ఆడదు కదా....ప్రియమణి
హిట్టు ..ప్లాపుల మీద దృష్టిపెట్టాల్సిందే.అలాగని ప్రతి సినిమా వంద రోజులు ఆడదు కదా. కొన్ని ఫ్లాప్ అవటం మామూలే. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు సాగలేం అంటూ తన వరస ఫెయిల్యూర్స్ గురించి ప్రియమణి క్లారిఫై చేసింది.అలాగే హీరోయిన్స్ కి పెరుగుతున్న రెమ్యునేషన్ గురించి చెబుతూ..ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్మాతలకు తెలుసు.
డిమాండ్‌ని బట్టే రెమ్యునేషన్ ఆధారపడి ఉంటుంది. మేం అడిగినంత ఇవ్వరు కదా అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.అలాగే మంచి కథలు వస్తే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని, అయితే అలాంటి కథలు రావడం లేదని అని వాపోయింది.ప్రస్తుతం ప్రియమణి క్షేత్రం'అనే చిత్రంలో చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రలో కనిపించనుంది.జగపతిబాబు ఆ చిత్రంలో హీరోగా చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











