భానుమతి పాత్ర చేసేందుకు నా కష్టం...ప్రియమణి
డిసెంబర్ మూడవ తేదీన విడుదల కానున్న రక్త చరిత్ర-2 చిత్రంలో తన పాత్ర చాలా కష్టమైనదని,ఆ భావోద్వేగాలు పండించటానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్తోంది. అలాగే సూర్య, వివేక్ ఒబరాయ్ పాత్రలతో పోల్చినప్పుడు తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అంటోంది. అలాగే జనాలకి పరిటాల రవి, సూరి తెలుసు కానీ, సూరి భార్య భానుమతి గురించి తెలియదు. దాంతో నాకు నేనే కొంత ఇలా ఉండవచ్చని ఊహించుకుని చేసాను.దాంతో చాలా కష్టమైపోయింది అంది. ఇక భానుమతి పాత్రకోసం తాను ఇంటర్నెట్ లో చాలా వెతకానని అయితే ఆమె గురించి చాలా తక్కువ రాసి ఉందని,అదొక సమస్యైందని చెప్పింది. నిజ జీవిత పాత్రను చాలా జాగ్రత్తగా పోషించాలనే ఆలోచనతోనే చాలా కష్టపడ్డానని అంది. ఇక నా కెరీర్ తెలుగు,కన్నడంలో బావుంది. ఈ చిత్రంతో తమిళం, హిందీలలో కూడా బ్రేక్ వస్తుందని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.
More from Filmibeat
ప్రియమణి రక్త చరిత్ర 2 వివేక్ ఒబేరాయ్ సూర్య రామ్ గోపాల్ వర్మ priyamani rakta charitra vivek oberoi surya ram gopal varma


Click it and Unblock the Notifications











