ఇలాంటి సినిమా ఎందుకు చేసానూ అని బాధ....ప్రియమణి
ఇలాంటి సినిమా ఎందుకు చేసాను? అని భవిష్యత్ లో బాధపడకపోతే అదే పది వేలు. అని ప్రియమణి తను సినిమాలు ఎంపిక చేసుకునే తీరును గురించి చెప్పుకొచ్చింది.ఆమె తను కంటిన్యూగా చేస్తున్న గ్లామర్ రోల్స్ గురించి మీడియాతో మాట్లాడుతూ...సినిమాలు చేసేది కేవలం డబ్బుల కోసమే...అలాగే ఓ సినిమా ఒప్పుకొనేలా ప్రేరేపించేది ఎప్పుడూ కథే కాకపోవచ్చు. కొన్నిసార్లు కాంబినేషన్లు, మొహమాటం కూడా కావచ్చ అంటోంది ప్రియమణి.అలాగే గ్యాప్ ఎక్కువ తీసుకోకుండా ఏదో ఓ సినిమా చేస్తూ ప్రేక్షకులకు కనిపించాలి. అలాగని మనసు చంపుకొని సినిమాలు చేయకూడదు. పదేళ్ల తరవాత టీవీలో మన సినిమా వస్తున్నప్పుడు బాధపడే సినిమా అయ్యుండకూడదు అంది. అదీ కరెక్టేగా.ప్రస్తుతం ప్రియమణి చేతిలో పెద్ద సినిమాలు ఏమీ లేవు. ప్రస్తుతం ఆమె క్షేత్రం అనే చిత్రంలో చేస్తోంది.ఆమె సరసన జగపతిబాబు చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications