కథే వినలేదు..డబ్బు కోసం చేసా: ప్రియమణి
నిజం చెప్పాలంటే అసలు 'రాజ్' సినిమా కథే వినలేదు. ఏదో చూఛాయగా చెప్పారంతే! దర్శకుడి మీద, నిర్మాతల మీద నమ్మకంతో సినిమా ఒప్పుకొన్నాను.. అయినా సినిమాలు చేసేది డబ్బులు సంపాదించడానికే కదా అని తేల్చేసింది ప్రియమణి. రీసెంట్ గా రిలీజైన రాజ్ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.సుమంత్, ప్రియమణి,విమలారామన్ కాంబినేషన్ లో వియన్ ఆదిత్య తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ రాజ్. ఆ చిత్రం చేయటానికి మీరు ఏ అంశాలు పరిగణనలోకి తీసుకున్నారనే విషయం మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగని ప్రతీసారీ కథ వినకుండా ఒప్పుకునే ప్రసక్తి లేదంటోంది. కథ కూడా ముఖ్యమే. అయితే దర్శకుడు సినిమాని ఎంత వరకూ సమర్థంగా తెరకెక్కించగలరు అనే విషయం మీద నమ్మకం కుదిరితే మరే విషయాలూ ఆలోచించను అంది. ప్రస్తుతం ప్రియమణి...బెల్లంకొండ సురేష్ నిర్మాతగా గోపిచంద్ మలినేని దర్సకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందే బాడీగార్డ్ రీమేక్ కమిటైంది.


Click it and Unblock the Notifications











