రామ్ గోపాల్ వర్మని పడేయటానికేనా ప్రియమణి అలా...
నిన్నటి దాకా మణిసార్ అంటూ మీడియా ముందు గారాలు పోయిన ప్రియమణి రావణ్ పోయిన దగ్గరనుంచీ ఆ ఊసే ఎత్తటం లేదు. తాజాగా బాలీవుడ్ లో తాను ఎదగటానికి మరో మార్గం రామ్ గోపాల్ వర్మ అనుకుందో ఏమో గానీ ఆయన్న గాడ్ ఫాదర్ ని చేసేస్తూ స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తోంది. గాడ్ పాధర్ అనే సినిమా వర్మకి ఇష్టమే అయినా ఇలా డైరక్ట్ గా స్టేట్ మెంట్ లు ఇచ్చేస్తే ఎంతవరకూ ఉపకరిస్తుంది అంటున్నారు. ఈ విషయం గురించి ప్రియమణి చెప్తూ..."మణిసార్ నన్ను బాలీవుడ్ కు పరిచయం చేసిన మాట నిజమే అయినా..ఇక్కడ నేను ఎదగడానికి ఉపయోగపడే మార్గనిర్దేశకం చేస్తుంది మాత్రం రామ్ సారే. అందుకే ఆయన్ను గాడ్ ఫాదర్ అంటున్నా. మరో విషయం ఏంటంటే..'రక్తచరిత్ర' నాకు అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్, కోలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకంతో ఉన్నా' అని చెప్పుకొచ్చింది ప్రియమణి. ఇక గోలీమార్ తర్వత తెలుగులో ఆమెకి సినిమాలేమీ రాలేదు. ప్రస్తుతం భరత్, ప్రియమణి జంటగా తమిళంలో రూపొందిన చిత్రం తెలుగులోకి 'బెట్'.. 'దేనికైనా ఛాలెంజ్' అనే టైటిల్ తో రిలీజవుతోంది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇక్కడ జనాలని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉందామె.


Click it and Unblock the Notifications











