ప్రియమణిపై వ్యామోహంతో తిరిగి...
ప్రియమణి అందచందాలకు, అణకువకు ఆ కుర్రాడు గులామ్ అయ్యాడు. ప్రియమణి తన జీవిత భాగస్వామి అయితే బాగుండు అని కూడా అనుకున్నాడు. విదేశాలలో విచ్చలవిడిగా క్లబ్బులకు, పబ్బులకు తిరిగిన యువకుడి ప్రేమను ప్రియమణి అంగీకరిస్తుందా? లేదా..? అని తెలుసుకోవడానికి 'ప్రియతమా రావే' చిత్రాన్ని చూడాల్సిందే అంటున్నారు నిర్మాతలు. వ్యామోహం తప్ప ప్రేమ విలువ తెలియని ఓ యువకుడు నిజమైన ప్రేమ కధే అని ఆ చిత్రం గురించి చెప్తున్నారు. అలాగే అల్లరి చిల్లరిగా తిరిగే ఓ యువకుడ్ని ప్రియమణి మంచివాడిగా మార్చేసింది అన్నది ఎంటర్టైనమెంట్ గా ఉంటుందని చెప్తున్నారు.
సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్.బి.చౌదరి కుమారుడు రమేష్, ప్రియమణి జంటగా నటించిన ఓ తమిళ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అల్లరి, చిల్లరి యువకుడిగా రమేష్, అతని మనసు మారడానికి కారణం అయ్యే అమ్మాయిగా ప్రియమణి అద్భుతమైన నటన కనబర్చారని నిర్మాత అంటున్నారు. విజయవాడకు చెందిన అలంకార్, జయరాం థియేటర్ల అధినేత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన కాకుమాను కృష్ణార్జునరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
జూన్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల అయ్యే ఈ చిత్రానికి పాటలు, మాటలు...వెలిదెండ్ల, సంగీతం...ఇళయరాజా, ఫొటోగ్రఫి...విన్సెంట్, దర్శకత్వం...దిన అరసు. ఇక ప్రియమణి హీరోయిన్ గా చేసిన గోలీమార్ చిత్రం ఈ వారమే రిలీజ్ అవుతోంది. అలాగే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న రక్త చరిత్ర చిత్రంలోనూ, మణిరత్నం దర్శకత్వంలో తయారైన భారీ చిత్రం రావణ్ లోనూ ప్రియమణి చేసింది.


Click it and Unblock the Notifications











