‘తిక్క’ చూపించనున్న ప్రియమణి
హైదరాబాద్: క్షేత్రం చిత్రం తర్వాత చాలా కాలంగా తెలుగులో సినిమాలు చేయని ప్రియమణి 'తిక్క' చిత్రం ద్వారా మళ్లీ తెలుగు తెరపైకి అడుగు పెడుతోంది. క్షేత్రం చిత్రం ప్లాపవ్వడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గి పోయాయి. దీంతో కన్నడ, మళయాలం చిత్రాలతో బిజీ అయిపోయింది.
తిక్క మూవీ వివరాల్లోకి వెళితే... శ్రీహరి, ప్రియమణి, రాజీవ్‌కనకాల, శివాడ్డి ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న చిత్రం 'తిక్క'. భరణి మినరల్స్ పతాకంపై బి.ఆర్.దుగ్గినేని స్వీయనిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రెండు పాటలు మినహా ఈచిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. నవంబర్ 22 నుంచి మిగిలిన షూటింగ్ ప్రారంభించనున్నారు. తాగుబోతు రమేష్, జీవా, పోసాని కృష్ణమురళి, రఘ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌వూపసాద్, మాటలు: స్వామీజీ-విజయ్, కథ-వూస్కీన్‌ప్లే-నిర్మాత-దర్శకత్వం: బి.ఆర్.దుగ్గినేని.
గత ఏడాదితో పోలిస్తే... ఈ ఏడాది వెనుకబడ్డారేంటని ఇటీవల మీడియా వారు ప్రశ్నించగా..."అవకాశం వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకుంటే... ఆలోచించకుండా వచ్చిన ప్రతి ఆఫర్‌ని ఒప్పుకుంటున్నారు అంటారు. కాస్త మంచి ప్రాజెక్టుల కోసం ఆగితే చాలు... ఆ హీరోయిన్‌కి అవకాశాలు రావడం లేదని ప్రచారం చేస్తారు. ఎలా అండి మీతో? ప్రస్తుతం నా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి'' అని చెబుతోంది ప్రియమణి.


Click it and Unblock the Notifications











