రవితేజ, ప్రియమణి జంటగా..
త్వరలో రవితేజ, ప్రియమణి జతకొట్టనున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న నడొడిగల్ రీమేక్ లో ఈ కాంబినేషన్ కనిపించనుంది. అలాగే అల్లరి నరేష్ కూడా మరో ముఖ్యమైన పాత్ర కన్పించే అవకాశముందని సమాచారం. తమిళ సుబ్రమణ్యపురం(అనంతపురం 1980)దర్శకుడు, హీరో అయిన శశికుమార్ నటించిన ఈ చిత్రం అక్కడ రికార్డులు సృష్టిస్తోంది. ఇక ప్రియమణి ప్రస్తుతం జగపతిబాబుతో కలసి ప్రవరాఖ్యుడు చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. తమిళ వెర్షన్ డైరక్ట్ చేసిన సముద్రఖని ఇక్కడ కూడా దర్శకత్వం వహించనున్నారు. అలాగే బెల్లంకొండ, రవితేజ కాంబినేషన్ రిపీట్ అవటం ఇది రెండో సారి. ఇంతకుముందు వారిద్దరూ కలిసి నా ఆటోగ్రాఫ్..స్వీట్ మెమరీస్ చిత్రానికి పనిచేసారు. ప్రస్తుతం రవితేజ..ఆంజనేయులు చిత్రం షూటింగ్ లో ఉన్నారు. అతని సరసన నయనతార నటిస్తోంది. యువత దర్శకుడు పరుశరామ్ దీనిని డైరక్ట్ చేస్తున్నాడు.
raviteja priyamani bellamkonda suresh samudrakhani remake నడొడిగల్ రీమేక్ రవితేజ ప్రియమణి సుబ్రమణ్యపురం సముద్రఖని


Click it and Unblock the Notifications