తెలుగు సినీ పరిశ్రమ హాట్ ప్రాపెర్టీగా మారిన ప్రియమణిని ఎవరూ వదులుకోదలుచుకోవటం లేదు. అలాగే ప్రియమణి కూడా ఏ అవకాశం కూడా మిస్సయ్యే సమస్య లేదన్నట్లుగా వరసగా కమిటవుతోంది.తాజాగా ఆమె హాట్ హీరో రవితేజా సరసన కూడా బుక్కయే అవకాశాలున్నట్లు సమాచారం. యువత దర్శకుడు రూపొందించనున్న చిత్రంలో ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రియమణి కూడా రవితేజ అనగానే ఎగిరిగంతేసినంత ఫీలింగ్ పెట్టి ఎప్పటినుంచో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఇక ప్రస్తుతం ప్రియమణి బాలకృష్ణ సరసన మహదేవన్ దర్శకత్వంలోనూ,నితిన్ సరసన ద్రోణ అనే చిత్రంలో బికినీలోనూ అందాలు చిందించటానికి రెడీ అవుతోంది. ఇక రవితేజ సినమా కూడా ఫినిష్ చేస్తే త్రిష,నయనతార సరసన చేరిపోయినట్లే నని ఆమె ఆలోచనట.