మళ్ళీ ప్రియమణి తో ఎన్టీఆర్?
యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ తో జతకట్టిన ప్రియమణి మరోసారి అతని ప్రక్కన చేయనుంది. మున్నా దర్శకుడు వంశి పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో ఈ కాంబినేషన్ మరోసారి కనువిందుచేయనుందని సమాచారం. ప్రస్తుతం బెడ్ రెస్ట్ లో ఉన్న ఎన్టీఆర్ కోలుకోగానే ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. ఇక వి.వి.వినాయిక్ దర్శకత్వంలో చేస్తున్న అదుర్స్ చిత్రం కూడా ఎన్టీఆర్ పూర్తి చేయాల్సి ఉంది. అదుర్స్ లో ఎన్టీఆర్ ద్విపాత్రలలో కనిపించనున్నారు. పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ చిత్రం రూపొందుతోందని, కోనవెంకట్ ప్రత్యేకంగా రూపొందించిన కామెడీ ఎపిసోడ్స్ సినిమాకు ప్లస్ అవుతాయని చెప్తున్నారు. ఇక పైడిపల్లి వంశి చిత్రం పూర్తి స్టాయి స్టైల్ గా ఉంటుందని స్టోరీ బోర్డ్ తో సహా షాట్ డివిజన్ రెడీ చేసుకునే రంగంలోకి దూకనున్నట్లు చెప్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ వంశి.


Click it and Unblock the Notifications











