చివరకు ప్రియమణి దానికీ ఓకే
బికినీ కి సై అని అదరకొట్టిన ప్రియమణి తాజాగా ఓ ఐటం సాంగ్ లో హాట్ గా నర్తించటానికి కమిటయ్యింది. శ్వేతాబసు,నిఖిల్ కాంబినేషన్ లో రానున్న కళావర్ కింగ్ లో ఈమె తన తడి తడి అందాలతో తెరను వేడిక్కించనుంది. అయితే హీరోయిన్ గా వెలుగుతూండగా ఈ ఐటం సాంగ్ ఏమిటీ అదీ నిఖిల్ లాంటి చిన్న హీరోలో చేయటమేమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. వ్రతం చెడినా ఫలితం దక్కాలన్నట్లు ఏ పెద్ద హీరో సినిమాలోనన్నా చేస్తే కాస్త డబ్బు అయినా గిట్టు పాటు అవుతుంది అని నోళ్ళు నొక్కుకుంటున్నారు. అయితే 2009 లో వరస సినిమాలు వచ్చినా ఒక్కటీ చెప్పుకోతగ్గ హిట్టు లేకపోవటంతోనే ఈమె ఆ నిర్ణయానికి వచ్చిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీపం ఉండగానే ఇళ్ళు చక్కపెట్టుకునే తీరున ఏదో కాస్త గుర్తింపు ఉన్నప్పుడే ఏదో విధంగా దొరికిన మేరకు డబ్బు దండుకోవాలనే ఆలోచన ఇలాంటి ఐటం సాంగులకు ఆమెను ఒప్పింస్తోందని అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











