రాజమౌళిని తప్ప...డైరెక్టర్లందరినీ ఏకి పారేసిన హీరోయిన్

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయిన్ ప్రియమణి టాలీవుడ్ దర్శకులపై తనదైన రీతిలో విమర్శల వర్షం కురిపించింది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళిని తప్ప అందరు దర్శకులను ఓ రేంజిలో ఏకి పారేసంది. రాజమౌళి తప్పించి మరే దర్శకుడూ ప్రియమణి టాలెంట్ సరైన విధంగా వాడుకోలేదని తెగ బాధ పడుతోంది.

ఒక రకంగా చెప్పాలంటే దర్శకులు తనను, తన టాలెంటును సరిగా వాడుకోక పోవడం వల్లనే తాను ఎదగలేక పోయానని పరోక్షంగా ఆరోపిస్తోంది ఈ మళయాలీ బ్యూటీ. యమదొంగ సినిమాలో రాజమౌళి ఇచ్చిన పాత్ర తనకి నటిగా సంతృప్తినిచ్చిందని చెప్తున్న ప్రియమణి తెలుగు దర్శకులలో లోపించిన ప్రొఫెషనలిజం కారణంగా మరిన్ని మంచి పాత్రలు తనకి లభించట్లేదని వాపోయింది.

Priyamani unhappy with Tollywood filmmakers

ప్రస్తుతం ప్రియమణికి తెలుగులో అవకాశాలు ఏమీ లేవు. ఈ మధ్య ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాపవ్వడమే ఇందుకు కారణం. అంగుళీక అనే చిత్రం కొంత షూటింగ్ జరుపుకున్నా....అది పోప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. దీంతో చేసేది లేక ఇతర బాషా చిత్రాల వైపు గేర్ మార్చింది.

ఇదే విషయాన్ని ప్రియమణి వద్ద ప్రశ్నిస్తే.......తెలుగులో అవకాశాలు వస్తున్నాయి కానీ, తనకు సంతృప్తిని ఇచ్చే పాత్రలు రావడం లేదని, సరైన పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని చెబుతోంది. ప్రస్తుతం ఆమె కన్నడలో అంబరీష అనే చిత్రంలో నటిస్తోంది. మరి కన్నడ చిత్రసీమలో అయినా ప్రియమణి దశ తిరుగుతుందో? లేదో? చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X