రమ్యకృష్ణ రూటులో ప్రయాణించాలనే ప్రియమణి ఆత్రుత
ప్రియమణికి ఈ మధ్యన ఓ పెద్ద కోరక పట్టుకుంది. అది నెగిటివ్ పాత్రలు చేసి మెప్పించాలని. అలాంటి పాత్ర వస్తే తాను పూర్తి స్ధాయి న్యాయం చేస్తానని, రెమ్యునేషన్ విషయంలో కూడా పెద్ద పట్టింపులు లేవని చెప్తోంది. ముఖ్యంగా నరసింహా చిత్రంలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి తరహా పాత్ర అయితే తాను లీనమై చేయగలనని, దర్శక, నిర్మాతలు ఈ విషయంలో కాస్త ఆలోచించాలని అంటోంది. అలాగే తాను 2010లో రక్త చరిత్ర, రావణ్, రగడ వంటి చిత్రాలు చేసినా కలసిరాలేదని అంటోంది. అయితే తన పాత్రకు మాత్రం ఈ మూడు సినిమాల్లో మంచి పేరే వచ్చిందని కాబట్టి కొంతలో కొంత తృప్తి చెందుతున్నానని అంది. గ్లామర్ పాత్రలు కన్నా తనలోని నటిని బయిటకు తీసే ఛాలెంజ్ పాత్రలంటే తను ప్రాణం పెడతానని, పరుత్తి వీరన్ లాంటి చిత్రాలు చేయటానికి అదే కారణమని వివరిస్తోంది. ప్రియమణి హీరోయిన్ గా కన్నడంలో లక్ష్మీ అనే చిత్రం రీసెంట్ గా ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications











