twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుప్పకూలిన హీరోయిన్..కారణం

    By Staff
    |

    Priyanka Chopra
    దోస్తానా చిత్రంలో తన అందచందాలను ప్రేక్షకులకు కనువిందు చేసిన స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తాజాగా ఓ చిత్రం షూటింగ్ లో కుప్పకూలింది. ముంబయి అవుట్ స్కర్ట్ లోని ఓ బంగళాలో షూటింగ్ జరుగుతుండగా హఠాత్తుగా కొలాఫ్స్ అవటం జరిగింది. వెంటనే డాక్టర్ ని పిలిచి టెస్ట్ లు చేయించారు. ఆయన లొ బ్లడ్ ఫ్రెసర్ అని తేల్చాడు. ఈ విషయంపై యూనిట్ సభ్యులు స్పందిస్తూ మొదట ఆమె అలా పడిపోవటం చూసి కంగారుపడ్డాం. ఈ లోగా ఎవరో ఫోన్ చేసినట్లున్నారు..క్షణాల్లో డాక్టర్ వచ్చారు. మాకయితే కాస్సేపు నోటి మాట రాలేదు.

    అయితే ఆ తర్వాత ఆమె కోలుకున్నాక షూటింగ్ పేకప్ చెప్తామన్నాం..కానీ ఆమె ఆ రోజు తీయాల్సిన సీన్స్ పూర్తి చేసే దాకా లొకేషన్ నుంచి కదలలేదు..అంటూ ఆమెను మెచ్చుకున్నాడు. ఇక ప్రియాంక మాట్లాడుతూ..కొద్దిగా డైటింగ్ చేస్తున్నా..ఆ ఎఫెక్టు పడింది..హఠాత్తుగా కళ్ళు తిరిగినట్లయింది..లేచి చూస్తే జనం అంతా ఆతృతగా నా వంకే చూస్తున్నారు..మొదట నాకేమీ అర్ధం కాలేదు..తర్వాత విషయం తెల్సుకుని చాలా సిగ్గేసింది అంటూ చెప్పుకొచ్చింది. కెరీర్ కుదురుపడాలని సైజ్ జీరో కాన్సెప్ట్ ని పోటీ పడి మరీ హీరోయిన్స్ పాటిస్తున్నారు..ఫలితం ఇలా కళ్ళు తిరగటమేనంటున్నారు సీనియర్స్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X