'తుఫాన్'లో నేను హత్యను చూసి... : ప్రియాంకచోప్రా
ప్రియాంకచోప్రా మాట్లాడుతూ.... ''ఈ చిత్రంలో నా పాత్ర పేరు మాల. మంచి వాగుడుకాయ. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. ఓ పెళ్లి కోసమని న్యూయార్క్ నుంచి ముంబై వస్తుంది. వచ్చీ రాగానే ఓ హత్యని చూస్తుంది. దీంతో కొద్దిమంది రౌడీలు నా వెంటపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరపైనే చూడాలి. పాత 'జంజీర్'లో జయాబచ్చన్‌గారు ఈ పాత్రని పోషించారు. అందులో చాకు చూరీ వాలీ పాత్రలో ఆమె చక్కటి అభినయం ప్రదర్శించింది. ఆ పాత్రకీ, నా పాత్రకీ పోలికలు లేకున్నా... భావోద్వేగాలు మాత్రం ఒకేలా ఉంటాయి.'' అన్నారు.
ఇక 'తుఫాన్'లో రామ్‌చరణ్ నటన, డ్యాన్సులు నన్ను బాగా ఆకట్టుకొన్నాయి. ఆయన పాత్రలో లీనమైపోయి నటించారు. తెరపై రామ్‌చరణ్‌ని చూస్తున్నంతసేపూ ఏసీపీ విజయ్ మాత్రమే కనిపిస్తాడు. రామ్‌చరణ్ మంచి నటుడు. ఎంతో కసితో నటించాడు. ఆయనతో కలిసి తెరను పంచుకోవడం మంచి అనుభవం. చిత్రాన్ని వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా తీర్చిదిద్దాడు దర్శకుడు అపూర్వ లఖియా. 'జంజీర్'లాంటి చిత్రాన్ని పునర్నిర్మిస్తున్నాడంటే ఆయనలో ఎంత ప్రతిభ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందరికీ వినోదాన్ని పంచి పెట్టే చిత్రమవుతుంది అని చెప్పింది.
అలాగే ''నటించడం ఎక్కడైనా ఒక్కటే. కాకపోతే సంభాషణలు పలకడంలోనే ఉంది అసలు విషయం. హిందీ వరకు నాకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. సెట్‌లో తెలుగులో సంభాషణలు పలికేటప్పుడు మాత్రం ఒకట్రెండు రోజులు ఇబ్బందిగా అనిపించింది. రామ్‌చరణ్ చాలా సాయం చేశాడు. తెలుగు పదాలకు అర్థం చెప్పి మరీ నాతో పలికించాడు. తనకు కూడా నేను కొన్ని హిందీ పదాలకు అర్థాలు చెప్పేదాన్ని. ఎలా ఉచ్ఛరిస్తారో వివరించేదాన్ని. ఇలా ఒకరికొకరు బాగా సాయం చేసుకొన్నాం. ప్రకాష్‌రాజ్, శ్రీహరి, తనికెళ్ల భరణి తదితర నటులతో కలిసి తెరను పంచుకోవడం చక్కటి అనుభవం. ఓ నటిగా నాకు ఎన్నో పాఠాలు నేర్పిన చిత్రమిది. భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని ఉంది'' అని చెప్పింది.


Click it and Unblock the Notifications












